ప్రాణహాని ఉందని కోర్టుకొస్తే పట్టించుకోవాల్సిందే

Published on Sat, 07/19/2025 - 05:56

సాక్షి, అమరావతి: తనకు ప్రాణహాని ఉన్నందున భద్రత కల్పించాలని కోరుతూ ఓ వ్యక్తి తమను ఆశ్రయిస్తే దానిని తాము సీరియస్‌గా తీసుకోవాల్సిందేనని హైకోర్టు స్పష్టంచేసింది. అతని ప్రాణాలకు హాని జరిగితే దానివల్ల ఆ వ్యక్తి కుటుంబానికి పూడ్చలేని నష్టం జరుగుతుందని తెలిపింది. అందువల్ల ఆ వ్యక్తికి భద్రత కల్పించాలని ఆదేశాలు ఇస్తున్నామని తెలిపింది.  వైఎస్సార్‌సీపీ నేత లింగాల రామలింగారెడ్డికి 1+1 భద్రతను పొడిగించాలని వైఎస్సార్‌ కడప జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. 

భద్రతకు అయ్యే ఖర్చులను భరించాలని రామలింగారెడ్డికి స్పష్టంచేసింది. మూడునెలల తరువాత క్షేత్రస్థాయిలో అప్పటికున్న వాస్తవ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని లింగాల రామలింగారెడ్డి భద్రత విషయంలో ఉన్నతాధికారులకు తగిన సిఫారసు చేయాలని  భద్రత సమీక్ష కమిటీ (ఎస్‌ఆర్‌సీ)ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నూనెపల్లి హరినాథ్‌ శుక్రవారం తీర్పు వెలువరించారు.

భద్రత ఉపసంహరణపై పిటిషన్‌..
2020లో అప్పటి ప్రభుత్వం తనకు ఇచ్చిన 1+1 భద్రతను ప్రస్తుత ప్రభుత్వం ఉపసంహరించడాన్ని సవాలుచేస్తూ వైఎస్సార్‌ కడప జిల్లా, వేముల గ్రామానికి చెందిన లింగాల రామలింగారెడ్డి ఈ ఏడాది ఏప్రిల్‌లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు, పిటిషనర్‌కున్న 1+1 భద్రతను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ఈ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సీజే ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలుచేసింది. భద్రతను పునరుద్ధరించాలన్న సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి ధర్మాసనం నిరాకరించింది. అయినా కూడా రామలింగారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం భద్రతను పునరుద్ధరించలేదు. దీంతో.. ఆయన జిల్లా ఎస్పీపై తాజాగా కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. 

కీలక అంశాలను పట్టించుకోలేదు..
పిటిషనర్‌ తరఫు న్యాయవాది తప్పెట నాగార్జునరెడ్డి, పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది (జీపీ) వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ.. భద్రత సమీక్ష కమిటీ అన్నీ అంశాలను పరిగణనలోకి తీసుకోలేదన్నారు. పిటిషనర్‌ వ్యాపార, రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నందున ఆయనకున్న ప్రాణహానిని పరిగణనలోకి తీసుకుంటూ 1+1 భద్రతను పొడిగించాలని జిల్లా ఎస్పీని ఆదేశిస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. 

Videos

గుర్తుపెట్టుకో అనిత.. మేమిచ్చే రిటర్న్స్ గిఫ్ట్ కి దిమ్మతిరిగి బొమ్మ కనపడుద్ది

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు

వీళ్లు అసలు పోలీసులా రౌడీలా... YSRCP నేతలపై దాడులు.. సజ్జల స్టాంగ్ రియాక్షన్

అర్ధరాత్రి కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్.. పల్నాడులో హైటెన్షన్...

ఏపీలో నేటి నుంచి పరిషత్ పోరు.. నామినేషన్ల వేళ టెన్షన్!

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

నన్ను చంపితే 2028లోపే చంపండి.. 2029 మాత్రం మీకు చుక్కలే

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

Photos

+5

విజయవాడ : భవానీ భక్తులతో ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

విజయదశమి శుభాకాంక్షలు చెప్పిన సెలెబ్రెటీలు (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!