Breaking News

‘సాక్షి’ కార్యాలయాలకు భద్రత కల్పించండి

Published on Thu, 06/12/2025 - 04:42

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘సాక్షి’ పత్రిక, టీవీ కార్యాలయాలు, ఆ సంస్థ పాత్రికేయులపై టీడీపీ నేతలు, కార్యకర్తలు, గూండాల దాడులను వెంటనే అరికట్టాలని ‘సాక్షి’ మీడియా గ్రూప్‌ ప్రతినిధుల బృందం డీజీపీ హరీశ్‌ కుమార్‌గుప్తాను కోరింది. పన్నాగం ప్రకారం దాడులకు దిగుతూ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు డీజీపీని ఉద్దేశించిన వినతిపత్రాన్ని అదనపు డీజీ (శాంతిభద్రతలు) మధుసూదన్‌రెడ్డికి సమర్పించింది. 

‘సాక్షి’ మీడియా గ్రూప్‌ ప్రతినిధులు బుధవారం మధుసూదన్‌రెడ్డిని మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో కలిశారు. రాష్ట్రంలో తమ సంస్థ కార్యాలయాలపై కొన్ని రోజులుగా జరుగుతున్న దాడులు, ఆస్తుల విధ్వంసాన్ని వివరించారు.  విజయవాడలోని ప్రధాన కార్యాలయంతో పాటు శ్రీకాకుళం, రాజానగరం, మంగళగిరి, తిరుపతి, అనంతపురం, చిత్తూరు, ఏలూరు తదితర నగరాల్లో ‘సాక్షి’ పత్రిక యూనిట్, ప్రాంతీయ కార్యాలయాలపై జరిగిన దాడుల తీవ్రతను తెలియజేశారు. 

బాధ్యతాయుతమైన మీడి­యా సంస్థగా... మహిళలు, పిల్లలు, ఇతర వర్గాల గౌరవానికి ఏమాత్రం భంగం కలిగించలేదని, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించిందని ఈ  సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధులు స్పష్టం చేశారు. కుట్రపూరితంగా కొందరు పత్రిక కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు, విధ్వంసానికి పాల్పడుతున్నారని అదనపు డీజీ దృష్టికి తీసుకెళ్లారు. డీజీపీ, ఇతర పోలీసు ఉన్నతాధికారులు తక్షణం జోక్యం చేసుకుని దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

దాడులకు పాల్పడినవారిపై ఇప్పటికే ఆధారాలతో సహా సమర్పించిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీస్‌ కమిషనర్లు, జిల్లా ఎస్పీలను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలని కోరారు. ‘సాక్షి’ ప్రతినిధులు సమర్పించిన వినతిపత్రంపై అదనపు డీజీ మధుసూదన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. దాడులకు పాల్పడినవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ‘సాక్షి’ కార్యాలయాలకు పూర్తి భద్రత కల్పిస్తామని చెప్పారు. 

Videos

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

22 మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా...?

ఎవరికీ ఏం జరిగిన నాదే బాధ్యత.. దాడి తర్వాత అత్యవసర సమావేశం

పోలీసులకెందుకంత భయం? ఎన్నికల్లో పోటీ చేయనివ్వరా? విశ్వేశ్వర్ రెడ్డి ఫైర్

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)