జుట్టుపట్టి ఈడ్చేసి.. కాలర్‌ పట్టి లాగేసి..!

Published on Fri, 09/19/2025 - 05:10

ఆదోని టౌన్‌/ఆదోని రూరల్‌/సాక్షి, అనకాపల్లి: ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం జులుం ప్రదర్శిస్తోంది. పోలీసులను ఉసిగొల్పి రోడ్డెక్కితే ఖబడ్దార్‌ అంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. కర్నూలు జిల్లా ఆదోని మండలం ఆరేకల్‌ సమీపంలో మెడికల్‌ కళాశాల వద్ద గురువారం విద్యార్థి, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేప­ట్టారు. 

కళాశాల ప్రైవేటీ­క­ర­ణ ఆలోచనను విరమించుకోవాలని ఏఐఎస్‌­ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ సంఘాల నేతలు, విద్యార్థినులు నినదించారు. కాలేజీకి చేరుకున్న పోలీసులు విద్యారు­్థలను జుట్టుపట్టి ఈడ్చేశారు. కాలర్‌ పట్టుకుని కొట్టినంత పనిచేసి లాక్కె­ళ్లారు. పోలీసులపై దాడి చేశారని.. జీపు డోర్‌ను ధ్వంసం చేశారని పేర్కొంటూ 10 మంది విద్యార్థి నాయకులపై కేసులు  నమోదు చేశారు.   

దర్నాను అడ్డుకున్న పోలీసులు
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మెడికల్‌ కాలేజీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన శాంతియుత నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. గురువారం నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోని భీమభోయినపాలెంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శాంతియుత ధర్నాకు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. 

ధర్నాకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్, పార్టీ లీగల్‌ సెల్‌ ప్రతినిధి మాకిరెడ్డి బుల్లిదొరతో పాటు 20 మంది వైఎస్సార్‌సీపీ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిరసన కార్యక్రమానికి నలుమూలల నుంచి బయలుదేరిన వైఎస్సార్‌సీపీ నాయ­కులను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్‌ మాట్లాడుతూ.. పోలీసులతో అరెస్ట్‌ చేయించినా.. కేసులు నమోదు చేసినా నర్సీపట్నం మెడికల్‌ కాలేజ్‌ ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకునేవరకూ పోరాడుతూనే ఉంటామని హెచ్చరించారు.

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)