డాక్యుమెంట్‌ రైటర్ల సమ్మె.. స్తంభించిన రిజిస్ట్రేషన్లు

Published on Tue, 07/21/2026 - 05:35

సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ప్రైవేటీ­కరణను వ్యతిరేకిస్తూ డాక్యుమెంట్‌ రైటర్లు సమ్మె­లోకి దిగడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆస్తుల క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ల వ్యవస్థ దాదాపు స్తంభించింది. డాక్యుమెంట్‌ రైటర్లు సోమ­వారం ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సేవల­న్నింటినీ నిలిపివేశారు. దీంతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యా­లయాలు వెలవెలబోయాయి. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారితో నిత్యం కిటకిటలాడే కార్యాలయాలు జనం లేక నిర్మానుష్యంగా కనిపించాయి. పలుచోట్ల డాక్యుమెంట్ల రైటర్లు తమ కార్యాలయాల వద్దే నల్ల రిబ్లన్లతో నిరసన తెలిపారు. ఈ సమ్మె కారణంగా రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం దారుణంగా పడిపోయింది. రోజూ సగటున 10 వేల రిజిస్ట్రేషన్లు జరిగేవి. తద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.50 నుంచి రూ.60 కోట్ల ఆదాయం వచ్చేది. కానీ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. 

ఆదాయం కూడా రూ.4 కోట్ల కంటే తక్కువ వచ్చినట్లు సమాచారం. ఈ 500 రిజిస్ట్రేషన్లలో కూడా ఎక్కువగా రెండు, మూడు రోజుల క్రితం మొదలుపెట్టిన ప్రక్రియకి సంబంధించినవిగా చెబుతున్నారు. రిజిస్ట్రేషన్‌ సేవా కేంద్రాల ఏర్పాటు ద్వారా రిజిస్ట్రేషన్ల వ్యవస్థ పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుందని డాక్యుమెంట్‌ రైటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సాధారణ ప్రజానీకంలోనూ రిజిస్ట్రేషన్ల ప్రైవేటీకరణపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు కంపెనీలకు ఈ వ్యవస్థను అప్పగిస్తే రాష్ట్రంలోని ఆస్తుల డేటా మొత్తం వారి చేతుల్లోకి వెళ్లి భూముల కబ్జాలు, మోసాలు విచ్చలవిడిగా జరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయినా సరే సీఎం చంద్రబాబు మాత్రం ప్రైవేటీకరణను కొనసాగిస్తామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Videos

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)