Breaking News

జాతీయ స్థాయి ఇంగ్లిష్‌ పోటీల్లో ఏపీ విద్యార్థుల ప్రతిభ 

Published on Mon, 04/15/2024 - 06:11

సాక్షి, అమరావతి: మన రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు జాతీయ వర్డ్‌ పవర్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో సత్తా చాటారు. విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంపొందించడంలో భాగంగా విభా, లీప్‌ ఫార్వార్డ్‌ సంస్థల ఆధ్వర్యాన నిర్వహించిన జాతీయ వర్డ్‌ పవర్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో రాష్ట్రానికి రెండు బహుమతులు సాధించారు. గత నెల 14వ తేదీన విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన ఐదుగురు విద్యార్థులు ఈ నెల 12న ముంబైలో జరిగిన గ్రాండ్‌ ఫినాలే పోటీల్లో పాల్గొన్నారు.

ఫైనల్స్‌లో ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం మండలం కనిమెర్ల మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలకు చెందిన మూడో తరగతి విద్యార్థి బి.రేవంత్‌కుమార్‌ రెండో స్థానం, ఐదో తరగతి విద్యార్థి అనిల్‌కుమార్‌ బాణావత్‌ మూడో స్థానంలో నిలిచారు. విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలను అంచనా వేసేందుకు జాతీయ వర్డ్‌ పవర్‌ చాంపియన్‌షిప్‌ దేశంలోనే అతిపెద్ద పోటీ కార్యక్రమం. ఈ పోటీలో ఏపీ నుంచి ఐదుగురు విద్యార్థులు పాల్గొనగా, ఇద్దరు విద్యార్థులు రెండు, మూడు స్థానాల్లో నిలవడం విశేషం. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను, విజేతలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి అభినందించారు.

ఈఎల్పీ ద్వారా శిక్షణ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థుల్లో ఆంగ్ల భాష నైపుణ్యాలను పెంపొందించేందుకు 2021లో ప్రభుత్వం ఇంగ్లిష్‌ లిటరసీ ప్రోగ్రామ్‌(ఈఎల్పి)ను ప్రారంభించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా, ఎస్సీఈఆరీ్టతో విభా, లీప్‌ ఫార్వర్డ్‌ సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ ప్రొగ్రామ్‌ ద్వారా 2, 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఇంగ్లిష్‌ పదాలను సులభంగా పలకడం, చదవడం నేర్పిస్తున్నారు. కనిమెర్ల మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో బహుమతులు సాధించడంతో ప్రభుత్వం చేపట్టిన ఈఎల్పీ సత్ఫలితాలు ఇస్తోందని స్పష్టమవుతోంది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)