Breaking News

బీభత్సం సృష్టించిన అంబులెన్స్‌.. మహిళ మృతి

Published on Mon, 02/09/2026 - 12:58

పశ్చిమగోదావరి: అత్యవసర స్థితిలో ఉన్న వా రిని ఆస్పత్రికి చేర్చి ప్రాణాలు నిలబెట్టే అంబులెన్స్‌ మృత్యు శకటంగా మారింది. వేగంగా దూసుకొచ్చి అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. బైక్, ఆటోను అంబులెన్స్‌ ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం మండలంలోని సీతారామపురం టోల్‌ప్లాజా సమీపంలో మొగల్తూరు వైపు నుంచి నరసాపురం వస్తున్న ఓ ప్రైవేట్‌ అంబులెన్స్‌ ముందు వెళుతున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది. అలాగే అదుపు తప్పి పక్కన వెళుతున్న ఆటోను ఢీకొట్టింది. 

మొగల్తూరు బండి ముత్యాలమ్మ ఆల యానికి వెళ్లి తిరిగి స్వగ్రామం యలమంచిలిలంకలోని వైవిలంకకు బైక్‌పై వెళుతున్న పిప్పళ్ల శ్రీవెంకట మోహన కృష్ణ, అతడి తల్లి, చినమ్మ సత్యలక్ష్మీ పద్మశ్రీ (40)కి తీవ్రగాయాలయ్యాయి. అలాగే ఆటోలోని డ్రైవర్‌తో పాటు ఇద్దరికీ గాయాల య్యాయి. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నరసాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నారు. తీవ్రగాయాలైన పద్మశ్రీని పాలకొల్లు తరలిస్తుండగా ఆమె మరణించింది. మృతురాలి భర్త నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నరసాపురం రూరల్‌ సీఐ దుర్గాప్రసాద్‌ తెలిపారు.    

 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)