Breaking News

మంగళగిరి ఎయిమ్స్‌ జాతికి అంకితం

Published on Mon, 02/26/2024 - 05:05

సాక్షి, అమరావతి/మంగళగిరి/తెనాలిఅర్బన్‌­/­మహారాణిపేట(విశాఖ దక్షిణ)/సాక్షి ప్రతినిధి, కాకినాడ: గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(ఎయిమ్స్‌)ను, కాకినాడలో నిర్మించిన 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రిని గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ నుంచి ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే వైఎస్సార్, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు, విజయనగరం మెడికల్‌ కాలేజీలతోపాటు తెనాలి, హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రుల్లో 9 క్రిటికల్‌ కేర్‌ యూనిట్ల ఏర్పాటుకు ఆయన శంకుస్థాపన చేశారు.

విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మైక్రోబయాలజీ, ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ను, నాలుగు సంచార ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ భారత్‌ సహా పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పా­రు.

మంగళగిరి ఎయిమ్స్‌లో 960 పడకలున్నాయని.. 41 విభాగాల్లో ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయని వివరించారు. 125 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. 2019 నుంచి రోగులకు ఓపీ సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎయిమ్స్‌ సేవలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిం­ంచాలని సూచించారు.  

అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌.. 
కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ ‘కరోనా, లాక్‌డౌన్‌ వంటి క్లిష్ట సమయాన్ని కూడా భారత్‌ సమర్థంగా ఎదుర్కొని ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చ­డమే మోదీ ప్రభుత్వ లక్ష్యం’ అని చెప్పారు.

కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ ప్రవీణ్‌ భారతీపవార్‌ మాట్లాడుతూ ‘2014­­కు ముందు ఎయిమ్స్‌లో చికిత్స పొందాలంటే ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చేది. మోదీ సర్కార్‌ వచ్చి న తర్వాత గత పదేళ్లలో ఎయిమ్స్‌ల సంఖ్య 22కు పెరిగింది. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ నవ భారతాన్ని ప్రధాని మోదీ నిర్మిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

ఎయిమ్స్‌కు అన్ని విధాల సహకారం
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ‘వైఎస్‌ జగన్‌ పాలనలో రాష్ట్రంలో ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత పెరిగింది. ఎయిమ్స్‌ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం 183 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. విద్యుత్‌ సరఫరా కోసం రూ.35 కోట్లతో 132 కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటుతో పాటు జాతీయ రహదారి నుంచి ఎయిమ్స్‌కు రూ.10 కోట్లతో అప్రోచ్‌ రోడ్‌ల అభివృద్ధి చేపట్టాం. రూ.7.74 కోట్లతో నీటి సరఫరా పనులు, రూ.2.2 కోట్లతో డ్రైన్‌ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చాం. ఉచితంగా నీటిని సరఫరా చేస్తున్నాం.

రాష్ట్ర ప్రజలకు వరల్డ్‌ క్లాస్‌ హెల్త్‌ కేర్‌ను అందించడమే సీఎం జగన్‌ లక్ష్యం. నాడు–నేడు, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్యశ్రీ వంటి ఎన్నో కార్యక్రమాలు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నాయి’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ సత్యవతి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు, సీఎం రమేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, ఉన్నతాధికారులు కృష్ణబాబు, నివాస్, గుంటూరు కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మధబానందక తదితరులు పాల్గొన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)