Breaking News

సంగీత, నాటక అకాడమీ అవార్డుల ప్రదానం

Published on Thu, 03/07/2024 - 02:38

సాక్షి, న్యూఢిల్లీ/విశాఖపట్నం: సంగీత, నృత్య, నా­టక రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన పలువు­రికి సంగీత నాటక అకాడమీ అవార్డులను రాష్ట్రప­తి ద్రౌ­పది ముర్ము ప్రదానం చేశారు. బుధవారం వి­జ్ఞా­న్‌ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 20­2­2, 2023 సంవత్సరాలకు గానూ విజేతలకు రాష్ట్ర­పతి పురస్కారాలు బహూకరించారు. ప్రము­ఖ కూచిపూడి నృత్యకారులు రాజా–రాధారెడ్డి 2022­–­23 గాను సంగీత నాటక అకాడమీ ఫెలో­షిప్‌ అందుకున్నారు. వీరితోపాటు.. ఆంధ్రప్రదేశ్‌­లోని గూ­డూరుకు చెందిన వినుకొండ సుబ్ర­హ్మ­ణ్యం 2022 సంవత్సరానికి కర్ణాటక ఇనుస్ట్రుమెంటల్‌ మ్యూ­జిక్‌ (తవిల్‌) విభాగంలో అవార్డు అందుకున్నారు.

కర్నూలుకు చెందిన మద్దాలి ఉషాగా­యత్రి కూచి­పూడి రంగంలో 2023 సంవత్సరా­నికి, అవనిగ­డ్డకు చెందిన ఎల్‌వీ గంగాధరశాస్త్రి సుగం సంగీ­త్‌లో 2023 సంవత్సరానికి, కర్ణాటక గాత్ర సంగీ­తంలో పేరుగాంచిన విశాఖకి చెందిన మం­డ (ఆ­లమూరు) సుధారాణి 2022 సంవత్స­రానికి పుర­స్కా­రాలు అందుకున్నారు. తెలంగాణ­లోని ఎల్లా­రెడ్డి­పేటకు చెందిన పేరిణి ప్రకాష్‌ పేరిణియాట్టంలో 2023 సంవత్సరానికి, హైదరా­బాద్‌కు చెందిన భాగవతుల సేతురామ్‌ కూచిపూ­డి నృత్యంలో 2022 సంవత్సరానికి అవార్డు అందుకున్నారు. 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)