Breaking News

పులివెందులలో పోలీసుల కళ్లకు టీడీపీ గంతలు

Published on Tue, 01/13/2026 - 12:54

పచ్చ ఖద్దరు చొక్కాల ముందు ..ఖాకీ యూనిఫాం తెల్లబోయిందా...!అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్న పోలీసు మాట తమ్ముళ్ల పాదాల కింద చిక్కి నలిగిపోయిందా..! అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. పండుగ మాటున పట్ట పగలే బరులు రూపుదిద్దుకుంటున్నాయ్‌... కోడి పందాలకు షామియానాలు లేస్తున్నాయ్‌.. జూదశాలల కోసం లక్షలు చేతులు మారుతున్నాయ్‌...అధికారం ఉందనే అహంకారమో.. పోలీసులు ఏం చేయలేరనే ధీమానోగానీ పచ్చ నేతలు బరి తెగించారు.

సాక్షి, పులివెందుల:  సంక్రాంతి పండుగ నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో కోడి పందేలు, జూదాలు కొనసాగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీటి నిర్వహణ ద్వారా టీడీపీ నాయకులు భారీగా సొమ్ము చేసుకోనున్నట్లు తెలుస్తోంది. జూదాలను అరికట్టాల్సిన పోలీ సులు వారికి  సహకరిస్తున్నట్లు సమాచారం.  

పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం దొండ్లవాగు, మురారిచింతల, పార్నపల్లె గ్రామా ల్లో టీడీపీ నాయకులు కోడి పందాలు నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కోడి పందాలు, జూదాలు, గుండాట, పేకాట, తదితర అసాంఘిక కార్యకలాపాల నిర్వహణకు ఉన్నతాధికారులు సైతం పర్మిషన్‌ ఇచ్చారని టీడీపీ నాయకులు ఉత్సాహంగా, ఉల్లాసంగా వాటి నిర్వహణ కోసం ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. ఈ మేరకు గుండాట, పేకాట ఆడించేందుకు వివిధ ప్రాంతాల వారిచే నిర్వాహకులు డబ్బులు కూడా తీసుకున్నారని సమాచారం. డబ్బులు ఇచ్చిన వారు తప్ప వేరేవారు ఆడేందుకు వీల్లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.  

నియోజకవర్గంలో భారీగా జూదాలు 
లింగాల మండలానికి చెందిన టీడీపీ నాయకుడొకరు వారం రోజుల నుంచి జూదాలు నిర్వహించడానికి దొండ్లవాగులో 5నుంచి 7ఎకరాల స్థలాన్ని చదును చేశాడు. అంతేకాకుండా ఆ ప్రాంతంలో జూదరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా షామియానాలను కూడా సిద్ధం చేశాడు. దీనికోసం జూద నిర్వాహకుల నుంచి లక్షల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. ఈనెల 14, 15, 16వ తేదీల్లో  లోపల.. బయట అనే పేకాట (మంగతాయి) ఆడించేందుకు విజయవాడకు చెందిన ఓ వ్యక్తి  సదరు లింగాల మండల నాయకుడికి లక్షల్లో ముట్టజెప్పినట్లు సమాచారం. అలాగే అక్కడే గుండాట నిర్వహించడానికి కడపకు చెందిన వ్యక్తి టీడీపీ నాయకుడికి రూ.15లక్షలు సమరి్పంచినట్లు సమాచారం. ఇవే కాకుండా కోడి పందాల నిర్వహణలో ఇప్పటికే పందెం దారులు కోట్లల్లో పందాలు ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై కూడా టీడీపీ నిర్వాహకుడైన మండల నాయకుడికి లక్షల్లో సమరి్పంచినట్లు సమాచారం.  

పోలీసులతో పనిలేదంటున్న టీడీపీ నాయకులు  
జూదరులకు పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని సదరు టీడీపీ మండల నాయకుడు గట్టిగా భరోసా ఇచ్చినట్లు సమాచారం. పోలీసులు తమను ఏమి చేయలేరని వారితో తమ నాయకుడు ముందుగానే మాట్లాడారని ఎలాంటి ఇబ్బంది ఉండదని, స్వేచ్చగా మూడు రోజులపాటు జూదం ఆడుకోవచ్చునని వారికి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఇక్కడ పెద్ద ఎత్తున జూదం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  

నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న పోలీసులు  
ఇంత జరుగుతున్నా ఖాకీలు కన్నెత్తి చూడడం లేదు. నిన్నా మొన్నటి వరకు సంక్రాంతి పర్వదినాలలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు విరివిరిగా ప్రచారాలు నిర్వహించారు. పైగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఎలాంటి జూదశాలలు నిర్వహించకూడదని, అలా జూదాలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ ఇదివరకే మీడియా సమావేశంలో హెచ్చరించారు. పులివెందులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయా.. లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఒక లింగాల మండలంలోనే కాకుండా పులివెందుల మండలంలోని కొత్తపల్లె, అచ్చివెళ్లి ఇతర గ్రామాలతోపాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో జూదశాలలు నిర్వహించేందుకు ఆయా మండలాలకు చెందిన టీడీపీ నాయకులు అన్ని విధాలుగా ఏర్పాట్లు పూర్తి చేశారు. పేకాటశాలలు వెలుస్తున్నా.. కోడి పందేల నిర్వహణకు బరులు సిద్ధం చేస్తున్నా స్పందించకపోవడంపై ఆయా గ్రామాల ప్రజలు పోలీసుల తీరును తూర్పారబడుతున్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)