Breaking News

ఏపీలో అంతర్రాష్ట్ర ప్రసార వ్యవస్థ.. పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆమోదం

Published on Tue, 03/14/2023 - 02:50

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ సంస్థ పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్రంలో భారీ వ్యయంతో నెలకొల్పే గ్రీన్‌ ఎనర్జీ ట్రాన్స్‌మిషన్‌ లైన్లను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కర్నూలు జిల్లాలో రూ.4,070.04 కోట్ల విలువైన రెండు భారీ ప్రాజెక్టులను నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టులకు పవర్‌ గ్రిడ్‌ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. రూ.3,546 కోట్ల అంచనా వ్యయంతో కర్నూలులో విండ్‌ ఎనర్జీ జోన్, సోలార్‌ ఎనర్జీ జోన్‌ కోసం అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్‌ లైన్ల ప్రాజెక్టు మొదటిది. ఇది 2025 నవంబర్‌కి ప్రారంభమవుతుంది. మరో ప్రాజెక్టు కొలిమిగుండ్ల వద్ద రూ.524.04 కోట్ల అంచనా వ్యయంతో వస్తుంది. ఇది 2024 నవంబర్‌కు  ప్రారంభిస్తారు.  

బీవోటీ విధానంలో..  
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ దేశమంతటా ట్రాన్స్‌మిషన్‌ లైన్లు నిర్వహిస్తోంది. విద్యుదుత్పత్తి సంస్థలు ఉత్పత్తి చేసే కరెంటును అమ్ముకోవడానికి ఈ నెట్‌వర్క్‌ను వినియోగించుకుంటాయి. అయితే, కొత్తగా నిరి్మంచే లైన్లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో బిల్ట్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్‌ (బీవోటీ) విధానంలో నిర్మించాలని కేంద్రం ఆదేశించింది. తాజా ప్రాజెక్టులు కూడా ఈ విధానంలోనే నిరి్మస్తారు. దీనివల్ల కొంతకాలం తరువాత ఈ లైన్లు ప్రభుత్వ ఆ«దీనంలోకి వస్తాయి. తద్వారా ట్రాన్స్‌కో, డిస్కంలపై ఆర్ధిక భారం తప్పుతుంది. గతంలో కంపెనీలు ఈ అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థను వినియోగించుకోవడం కోసం లాంగ్‌ టర్మ్‌ యాక్సెస్‌ విధానంలో పవర్‌ గ్రిడ్‌కు దరఖాస్తు పెట్టుకునేవి. అయితే, కేంద్ర ప్రభుత్వం లాంగ్‌టర్మ్‌ యాక్సెస్‌కు బదులు జనరల్‌ నెట్‌వర్క్‌ యాక్సెస్‌ (జీఎన్‌ఏ) విధానాన్ని తెచి్చంది. దీంతో అవసరాలకు తగ్గట్టు ట్రాన్స్‌మిషన్‌ లైన్లను ఇతరులకు ఇవ్వడం, ఇతరుల నుంచి వాడుకోవడం వంటివి స్వల్ప, మధ్యకాలిక ఒప్పందాల ద్వారా చేయొచ్చు. 

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)