Breaking News

త్వరలో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ

Published on Mon, 12/16/2024 - 04:04

సాక్షి, అమరావతి :  పొట్టి శ్రీరాములు పేరుతో రాష్ట్రంలో తెలుగు యూనివర్సిటీని త్వరలో  ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా విజయవాడలో జరిగిన సభలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, పలువురు మంత్రులు పాల్గొని అమరజీవితో పాటు సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చిత్రపటాలకు నివాళులు అర్పించారు. 

అనంతరం సీఎం మాట్లాడుతూ.. చాలాకొద్ది మందే జాతికోసం ఆలోచిస్తారని, పొట్టి శ్రీరాములు 58 రోజులపాటు నిరాహార దీక్షచేసి తెలుగుజాతి కోసం ప్రాణాలర్పించగా.. దేశాన్ని ఐకమత్యంగా ఉంచేందుకు పోరాడిన ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అని కొనియాడారు. వీరిద్దరి వర్థంతులు ఒకేరోజు నిర్వహించుకోవడం గొప్ప అంశమన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారు అనేక ఇబ్బందులు పడ్డారని, ప్రత్యేక ఆంధ్ర కోసం అనేక ఉద్యమాలు జరిగాయని తెలిపారు. 

మనకు తమిళ మంత్రులు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేలోపే బ్రిటిష్‌ వారు స్వాతంత్య్రం ఇస్తారని 1913లో బాపట్లలో జరిగిన ఆంధ్ర మహాసభలో భోగరాజు పట్టాభి సీతారామయ్య చెప్పారని.. అదే నిజమైందని, 1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిందని చంద్రబాబు గుర్తుచేశారు. అమరజీవి పేరుతో హైదరాబాద్‌లో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేస్తే తాను నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు జిల్లాగా నామకరణం చేశానన్నారు. వచ్చే మార్చి 16 నుంచి అమరజీవి 125వ జయంత్యుత్సవాలు నిర్వహిస్తామని చంద్రబాబు చెప్పారు.  

ఆయన ఆంధ్ర జాతికి నాయకుడు : డిప్యూటీ సీఎం  
కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతూ.. అమరజీవి పొట్టి శ్రీరాములు భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడని, ఆయన ఒక కులానికి నాయకుడు కాదని, ఆంధ్ర జాతి మొత్తానికి నాయకుడన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించి 2.2 ట్రిలియన్‌ డాలర్ల ఆరి్థక వ్యవస్థగా పురోగతి సాధించడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి అన్నారు. 

కేవలం సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం బతికిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని.. రాష్ట్ర విభజన తరువాత తనకు ఆయన గొప్పతనం అర్థమైందన్నారు. మన ఉనికి కోసం మద్రాసులో ఆమరణదీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు పాడె మోయడానికి కూడా ఆనాడు కష్టపడాల్సి వచ్చిoదని తెలిసి తన గుండె కదిలిపోయిందని పవన్‌ చెప్పారు. 

ఘంటసాల, మరో నలుగురు కలిసి పాడె మోశారని, ఈరోజు మనం ఆంధ్రులమని గర్వంగా చెప్పుకుంటున్నామంటే అది ఆ మహనీయుడు బలిదానంతో పెట్టిన భిక్షేనన్నారు. మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటలను అమ్ముకోలేని స్థితి గత ప్రభుత్వ పాలనలో ఉందన్నారు. కార్యక్రమంలో మంత్రులు పొంగూరు నారాయణ, అచ్చెన్నాయుడు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)