Breaking News

పోసాని కస్టడీ పిటిషన్ కొట్టివేత

Published on Mon, 03/10/2025 - 18:34

సాక్షి,కర్నూలు.: కూటమి సర్కారు అక్రమంగా బనాయించిన కేసులో అరెస్టైన ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్టమురళీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్‌ను కర్నూల్ జేఎఫ్‌సీఎం కోర్టు కొట్టివేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు కోర్టు మేజిస్ట్రేట్. ఈ నెల ఆరో తేదీన జేఎఫ్‌సీఎం కోర్టులో ఆదోని పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. పోసానిని విచారించే క్రమంలో కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఏడో తేదీన తీర్పును రిజర్వ్ చేసిన మేజిస్ట్రేట్.. ఇవాళ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ తీర్చు ఇచ్చారు.  ఇక బెయిల్ పిటిషన్‌పై  తీర్పు రిజర్వ్ చేశారు మేజిస్ట్రేట్‌.

ఇదిలా ఉంటే, అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ కడప మొబైల్ కోర్టు గత శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. పోసానికి బెయిలు ఇవ్వకూడదని పోలీసుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించినప్పటికీ.. కోర్టు పోసాని తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ... బెయిల్ మంజూరు చేసింది. పోసాని కస్టడీ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. ఈ కేసులోనే పోసాని ఫిబ్రవరి 26వ తేదీన అరెస్టయ్యారు.

పోసానిని హైదరాబాద్‌లోని నివాసంలో అరెస్ట్‌ చేసి.. ఆ మరుసటి రోజు ఓబులవారిపల్లెకు తీసుకెళ్లారు. అటుపై పల్నాడు జిల్లా నరసరావుపేటలో, కర్నూల్‌ జిల్లా ఆదోనీ పీఎస్‌లలో నమోదైన కేసుల్లో పీటీ వారెంట్‌ కింద ఆయన్ని తరలించారు. ఈ కేసుల్లో ఉపశమనం కోరుతూ ఆయన వేశారు. మరోవైపు హైకోర్టులోనూ ఆయన వేసిన క్వాష్‌ పిటిషన్‌ విచారణ దశలో ఉంది.

పోసాని క్వాష్‌ పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
 

Videos

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

నామినేషన్లకు వస్తే.. కంకర రాళ్లతో కొడతాం

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)