Breaking News

ప్యాక్‌ చూస్తే సన్న బియ్యం.. విప్పి చూస్తే రేషన్‌ బియ్యం!

Published on Tue, 09/17/2024 - 05:54

పిఠాపురం : వరద కారణంగా సర్వం కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న వరద బాధితు­లను కూటమి ప్రభుత్వం హీనంగా చూస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ ఇలాకాలో వరద బాధితులకు అందించిన రేషన్‌ సరకులు నాసిరకంగా ఉండటంతో బాధితులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాలైన కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలంలో ప్రభుత్వం వరద బాధితులకు రెండు రోజులుగా బియ్యం, నిత్యావసర వస్తువుల ప్యాకెట్లను పంపిణీ చేస్తోంది. వాటిని అందుకున్న బాధితులు విప్పి చూసి అవాక్కవుతున్నారు.

 పాడైపోయిన ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, నల్ల రంగులో పులిసిన వాసనతో చక్కెర, సైరస్‌ కంపెనీ 25 కేజీల బియ్యం బ్యాగ్‌లో రేషన్‌ బియ్యం కనిపిస్తుండటంతో వరద బాధితులు విస్తుబోతున్నారు. బ్యాగ్‌ చూసి ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చిందని సంతోషించిన వరద బాధితులు అందులో రేషన్‌ బియ్యాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వండిన వంట జావగా మారడంతో ఇవి తిని ఆస్పత్రి పాలవమంటారా.. అని ప్రశ్నిస్తున్నారు. పాడైన ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, చక్కెరను చెత్తలో పారేస్తున్నారు. చంద్రబాబు.. పవన్‌కళ్యాణ్‌ ఇవి తింటారా అని ప్రశ్నిస్తున్నారు. మరి కొందరికి వరద సాయం అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)