Breaking News

టీడీపీ నేత ‘గాజుల’ రాసలీలలు

Published on Fri, 10/18/2024 - 05:24

రాయచోటి: తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వ్యవహారం ముగియక ముందే తాజాగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం పార్టీ పరిశీలకుడుగా ఉంటున్న గాజుల ఖాదర్‌బాషా నిర్వాకం వెలుగు­లోకి వచ్చింది. రాయచోటిలోని ఓ మహిళను లోబర్చుకుని సాగించిన రాసలీలల వీడియోలు బహిర్గతమవడం ఇప్పుడు సంచల­నంగా మారింది. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహి­తుడిగా, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌­రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉంటూ రాయ­చోటి నియోజక­వర్గంలో బాషా చక్రం తిప్పుతు­న్నాడు.

మంత్రులు, అధికారులు తన గుప్పెట్లో ఉన్నారంటూ అధికార యంత్రాంగాన్ని, నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు విమర్శలు­న్నాయి. రాజకీయంగా కానీ, మరే ఇతర పనులు జరగాలన్నా తనకు ‘కావా­ల్సిన’ పనులు చేసి పెట్టాల్సిందేనని ‘గాజుల’ హుకుం జారీచేస్తుంటాడని.. ఈ నేపథ్యంలోనే రాయచోటిలో పేద, మధ్య తరగతి మహిళలనే ఆయన టార్గెట్‌గా పెట్టుకున్నాడన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. 

తన కోరిక తీరిస్తే పెన్షన్‌ లేదా ఇంటి స్థలం ఇప్పిస్తానంటూ మహిళలను లోబర్చుకుని అకృత్యాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణ­లున్నాయి. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఖాదర్‌బాషా పెన్షన్‌ ఇప్పిస్తానంటూ ఓ మహిళకు నమ్మబలికి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గురువారం ఉదయం బాధితురాలే స్వయంగా మీడియాకు తెలియజేశారు. దీంతో అసలు విషయం బయటకొచ్చింది.

పార్టీ పరువును గంగలో కలిపారు
అధికారాన్ని అడ్డుపెట్టుకుని గాజుల ఖాదర్‌బాషా మహిళలపై లైంగిక దాడులతో పార్టీ పరువును గంగలో కలిపాడంటూ ఆ పార్టీ నాయకులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వీడియోల రూపంలో వైరల్‌ అవుతున్న దృశ్యాలు పార్టీకి మరింత నష్టం తెచ్చేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకాకపోవడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న తరుణంలో ఇలాంటి దారుణాలు పార్టీని మరింత ఇబ్బందుల్లోకి తీసుకెళ్తాయని ఆ పార్టీ సీనియర్‌ నేతలు మండిపడుతున్నారు. 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)