Breaking News

నెల్లూరు డబుల్‌ మర్డర్‌.. గంజా బ్యాచ్‌ పనే!

Published on Wed, 10/08/2025 - 13:47

సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో గంజాయి వ్యాపారం స్వైర విహారం చేస్తోంది. అక్రమ రవాణా, నిల్వ, వినియోగం వంటి కార్యకలాపాలు వెలుగు చూస్తుండడం.. పోలీసుల నిఘా లోపాలను బయటపెడుతోంది. తాజాగా నెల్లూరు జిల్లా పెన్నా బ్యారేజ్‌ వద్ద వెలుగు చూసిన డబుల్‌ మర్డర్‌ కేసు.. గంజాయి బ్యాచ్‌ పనేనని నిర్ధారణ అయ్యింది. 

మంగళవారం ఉదయం.. పెన్నా బ్యారేజీ వద్ద రోడ్డుపై నెత్తురు మరకలు, మూడు జతల చెప్పులు ఉండడం చూసిన స్థానికులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సంతపేట పోలీసులు అనుమానంతో నదిలో గత ఈతగాళ్లను దింపి రెండు మృతదేహాలను వెలికి తీయించారు. అయితే అక్కడి సీసీటీవీ ఫుటేజీలు పని చేయకపోవడంతో నిందితులను పట్టుకోవడం కష్టమనే భావించారంతా. దీంతో.. ఎస్పీ అజితా ఆదేశాలతో నాలుగు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలించాయి.

ఈ తరుణంలో.. కందుకూరు వద్ద బుధవారం ఉదయం నిందితులు ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  హంత‌కులిద్దరూ గంజాయ్ బ్యాచ్‌గా గుర్తించారు. అడిగితే నగదు ఇవ్వలేదని కోపంతో ఇద్దరిని హత్య చేసినట్లు నిందితులు అంగీకరించినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలతో పాటు నిందితుల వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)