Breaking News

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటనపై పోలీసుల నివేదిక

Published on Mon, 11/25/2024 - 19:43

సాక్షి, కృష్ణా జిల్లా: గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల.. ఇటీవల ఈపేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఇంజనీరింగ్‌ కాలేజీ లేడీస్‌ హాస్టల్‌ బాత్రూమ్‌లో రహస్య కెమెరాలు ఏర్పాటు చేశారంటూ గత ఆగష్టులో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై కాలేజీ విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. బాత్రూంలలో సీక్రెట్ కెమెరాలు అమర్చి.. స్టూడెంట్స్ వీడియోలు తీసి వాటిని వైరల్ చేసి విక్రయిస్తున్నారని ఆందోళన చేపట్టడంతో.. ఈ వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది.

తాజాగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ లేడీస్ హాస్టల్ బాత్రూమ్స్‌లో ఎలాంటి హిడెన్ కెమెరాలు లేవని అధికారులు తేల్చారు. స్టేట్ ఫోరెన్సిక్ లేబరేటరీస్ పరీక్ష ద్వారా ఈ విషయం నిర్ధారణ అయినట్లు ప్రకటించారు. ఈ మేరకున జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు , కలెక్టర్ డి.కె.బాలాజీ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

కాగా ఆగష్టు 28న  గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కాలేజీ గల్స్‌ హాస్టల్‌లోని వాష్‌రూమ్స్‌లో సీక్రెట్‌ కెమెరాలు అమర్చారంటూ విద్యార్ధులు ఆందోళనలు చేపట్టడం కలకలం రేపింది. గతంలోనే ఈ ఘటనపై విద్యార్థులు.. కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు… హాస్టల్‌ను పరిశీలించారు. విద్యార్థినులు, కళాశాల సిబ్బంది, తల్లిదండ్రుల సమక్షంలోనే హాస్టల్‌ మొత్తం తనిఖీ చేశారు. ఎలక్ట్రానిక్‌ డివైస్‌ను గుర్తించే పరికరంతో హాస్టల్‌లో అణువణువూ తనిఖీ చేశారు.  రూము రూము తిరిగారు. 

విద్యార్ధినిల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, అనుమానితుల నుంచి ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. చివరికి హాస్టల్‌లో ఎలాంటి రహస్య కెమెరాలను లేవని ఎస్పీ తెలిపారు. అయితే  మీడియాలో, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు రావడంతో  ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించగా.. తాజాగా నివేదిక సమర్పించారు.

 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)