యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా.. 10 మంది మహిళలు అరెస్ట్

Published on Sat, 02/22/2025 - 12:02

గుణదల(విజయవాడతూర్పు): స్పా సెంటర్ల ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై మాచవరం పోలీసులు దాడి చేశారు. మాచవరం సీఐ ప్రకాష్‌ తెలిపిన వివరాల ప్రకారం వెటర్నరీ కాలనీ సర్వీస్‌ రోడ్డు సమీపంలో స్టూడియో 9, ఏపీ 23 పేరుతో చలసాని ప్రసన్న భార్గవ్‌ ప్రైవేట్‌ యూ ట్యూబ్‌ చానల్‌ నిర్వహిస్తున్నాడు. ఆ బిల్డింగ్‌ పై భాగంలో స్పా సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. యూట్యూబ్‌ చానల్‌ నిర్వహిస్తున్నట్లు నమ్మించి ఆ ముసుగులో స్పా సెంటర్‌లో వ్యభిచార గృహం నడుపుతున్నాడు. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను అక్రమంగా రప్పించి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నాడు. 

అమ్మాయిలతో వల వేసి బడా బాబులను టార్గెట్‌ చేసి లక్షలాది రూపాయల అక్రమార్జనకు పాల్పడుతున్నాడు. ఆ బిల్డింగ్‌లో వ్యబిచారం జరుగుతున్నట్లు మాచవరం పోలీసులకు సమాచారం అందింది. దీంతో శుక్రవారం రాత్రి స్పా సెంటర్‌ పై దాడి చేశారు. అక్కడ ఉన్న పది మంది మహిళలను, 13 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దాడి విషయం తెలిసిన భార్గవ్‌ పరారయ్యాడు. అతడిని పట్టుకునేందుకు పోలసులు గాలిస్తున్నారు.

మరెన్నో ఆరోపణలు..
భార్గవ్‌కు పలు వ్యభిచార ముఠాలతో సత్సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యూ ట్యూబ్‌ చానల్‌ పేరుతో ధనికులను, అధికారులను బెదిరించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇతను తెలుగుదేశం పార్టీకి చెందిన చోటా నేతగా చెలామణి అవుతున్నట్లు చెబుతున్నారు.

 

ప్రేమించకపోతే మీ కుటుంబ సభ్యులను చంపేస్తా..!



 

 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)