Breaking News

పోలీసుల ఓవరాక్షన్‌... తిరగబడ్డ గ్రామస్తులు

Published on Tue, 08/05/2025 - 05:15

ఉదయగిరి/వరికుంటపాడు: మైనింగ్‌ మాఫియాకు మద్దతుగా పోలీసులు చేసిన ఓవరాక్షన్‌ ఓ వ్యక్తి ప్రాణాల మీదకు తెచ్చింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు ఎస్సై కె. రఘునాథ్‌ దురుసు ప్రవర్తనతో పోలీస్‌స్టేషన్‌ వద్ద రోజంతా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వివరాలివీ.. మండల కేంద్రం వరికుంటపాడు పంచాయతీ జంగంరెడ్డిపల్లిలోని పల్లతిప్పలో మైనింగ్‌కు వ్యతిరే­కంగా, పార్టీలకతీతంగా గ్రామస్తులందరూ ఏకమై వారం రోజులుగా పోరుబాట పట్టారు. ఇందులో కీలకపాత్ర పోషిస్తున్న టీడీపీకి చెందిన బూత్‌ కన్వీనర్‌ షేక్‌ పీర­య్య­ను విచారణకు రమ్మంటూ మూడ్రోజులుగా పోలీ­సులు ఒత్తిడి చేస్తున్నారు.

ఈ క్రమంలో.. సోమవారం ఉ.6 గంటలకు ముగ్గురు కానిస్టేబుల్స్‌ వచ్చి పీరయ్య తన షాపులో ఉండగా బలవంతంగా తీసుకెళ్లారు. దీంతో అక్కడున్న కొంతమంది పీరయ్య­ను అనుసరిస్తూ స్టేషన్‌కు వెళ్లారు. అయితే, పోలీసులు పీరయ్యను ఒక్కడినే లోపలికి తీసుకెళ్లి, మిగతా వారిపై దురుసుగా ప్రవర్తించి పంపించివేశారు. ఎస్సై రçఘునాథ్‌ తెల్లకాగితంపై పీరయ్యతో సంతకం చేయించే విషయంలో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో తోపులాట, వాగ్వాదం జరిగింది. దీంతో పీరయ్య గుండెపోటుకు గురై కుప్పకూలారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అతనిని పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ నుంచి ఒంగోలు తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో విజయవాడకు తరలించారు.

స్టేషన్‌ను ముట్టడించిన గ్రామస్తులు
ఇది తెలుసుకున్న గ్రామస్తులు, మహిళలు మొత్తం స్టేషన్‌ వద్దకు చేరుకుని జాతీయ రహదారిపై రాస్తారోకోకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. స్టేషన్‌ లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య తోపులాట జరిగింది. మహిళలు పోలీసుల వలయాన్ని ఛేదించుకుంటూ ఎస్సై గదిలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసులు అడ్డుకోవడంతో వారు స్టేషన్‌ ఎదుట బైఠాయించి పోలీ­సులకు వ్య­తిరేకంగా నినాదాలు చేసి, ఎస్సైను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మధ్యాహ్నం జోరు వర్షంలోనూ ఆందోళన కొనసాగించారు. పరిస్థితి అదుపు తప్పు­­తుండడంతో భారీగా పోలీసు బలగాలను దించారు.

ఎస్సై క్షమాపణతో శాంతించిన గ్రామస్తులు
పీరయ్యను ఎందుకు స్టేషన్‌కు బలవంతంగా తీసుకొ­చ్చారని కుటుంబ సభ్యులు నిల­దీయగా, ఎస్సై రఘునాథ్‌ వచ్చి ఉద్యమంలో ఉన్న ఎనిమిది మందిపై కేసు నమోదుచేశామని, అందులో భాగంగా విచా­రణ కోసం తీసు­కొచ్చినట్లు చె­ప్పారు. అయి­నా శాంతించని గ్రామస్తులు రాత్రి వరకు ఆందోళన చేస్తూనే ఉన్నారు. చర్చలకు అçహ్వానం పంపినా, ఎస్సైను సస్పెండ్‌చేసే వరకు స్టేషన్‌ నుంచి కదలబోమని భీష్మించి కూర్చున్నారు. రాత్రి ఏడు గంటలకు ఎస్సై రఘునాథ్‌ వచ్చి గ్రామ­స్తులకు క్షమాపణ చెప్పడంతో వారు వెనుదిరిగారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)