Breaking News

ఎవరు ఇప్పించారు?.. ఎవరి ద్వారా చెప్పించారు?

Published on Tue, 11/18/2025 - 16:29

విజయవాడ: నగరంలోని ఆటోనగర్‌లో ఆపరేషన్‌ చేపట్టి 28 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ స్పష్టం చేశారు.  హిడ్మా గ్యాంగ్‌ ఆటోనగర్‌లో షెల్టర్‌ తీసుకుందని, దీనిపై విశ్వసనీయ సమాచారం ద్వారా భారీ సంఖ్యలో మావోయిస్టులను పట్టుకున్నామన్నారు. పట్టుబడిన వారిలో 21 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారన్నారు. వీరంతా చత్తీస్‌గడ్‌కు చెందినవారేనని ఎస్పీ తెలిపారు.

ఇదిలా ఉంచితే, మావోయిస్టులకు ఇంటిని అద్దెకు ఇచ్చిన దానిపైనే ఇప్పడు దృష్టి సారించారు పోలీసులు. అసలు ఆ ఇంటి యజమాని.. మావోయిస్టులకు ఇంటిని ఎలా అద్దెకు ఇచ్చాడనే దానిపై ఆరా తీస్తున్నారు. అతనికి మావోయిస్టులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఎవరు చెబితే ఇచ్చారు.. ఎవరి ద్వారా చెప్పించారు అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు.

విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. మంగళవారం కానూర్‌(పెనుమలూరు) కొత్త ఆటోనగర్‌లోని ఓ భవనంలో మావోయిస్టులు తలదాచుకున్నారనే సమాచారం అందుకున్న స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(SIB) భారీ సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టింది. బిల్డింగ్‌ను ఖాళీ చేయించి మొత్తం 27 మంది మావోయిస్టు సానుభూతి పరుల్ని అదుపులోకి తీసుకుంది.

ఆపరేషన్‌ కగార్‌ ప్రభావంతో మావోయిస్టులు, సానుభూతిపరులు పట్టణాళ్లో తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టిన పోలీసులకు ఆరుగురు అనుమానాస్పద రీతిలో పట్టుబడ్డారు. వీళ్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. న్యూ ఆటోనగర్‌లోని ఓ భవనాన్ని షెల్టర్‌ జోన్‌గా మార్చుకున్నారని నిర్ధారణ అయ్యింది. 

భారీగా ఆయుధాలు డంప్‌ చేసి ఉంటారని భావించిన అధికారులు.. అక్టోపస్‌ పోలీసుల సాయంతో భవనాన్ని జాగ్రత్తగా ఖాళీ చేయించారు. ఆపై అందరినీ అదుపులోకి తీసుకుని టాస్క్‌ఫోర్స్‌ ఆఫీస్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)