Breaking News

విశాఖ వసంత కేసు.. నాగేంద్ర ఫోన్‌ హిస్టరీ చూసి షాకైన పోలీసులు!

Published on Sat, 02/15/2025 - 11:08

సాక్షి, విశాఖ: విశాఖలో భర్త వికృత చేష్టలు, వేధింపులు తాళలేక వివాహిత వసంత ఆత్మహత్యకు పాల్పడింది. నీలి చిత్రాలు చూపిస్తూ.. అందులో చేసినట్లు చేయాలని భర్త వేధించడమే దీనికి కారణమని తేలింది. ఈ క్రమంలో బాధితురాలి భర్త నాగేంద్రను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అనంతరం, నాగేంద్ర ఫోన్‌లో గూగుల్‌ హిస్టరీ చూసి పోలీసులే షాక్‌ అయినట్టు సమాచారం.

వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన నాగేంద్రబాబుకు, వసంతతో గతేడాది వివాహమైంది. ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్న సదరు యువకుడు నీలి చిత్రాలకు బానిసగా మారాడు. వయాగ్రా మాత్రలు వేసుకుంటూ, నీలి వీడియోలు భార్యకు చూపిస్తూ అలా చేయాలని వేధిస్తున్నాడు. గురువారం రాత్రి ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద వయాగ్రా ట్యాబ్లెట్ల డబ్బాను స్వాధీనం చేసుకున్నారు.

ఇక, ఈ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. నాగేంద్రను రిమాండ్‌కు తరలించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడి ఫోన్‌ను పోలీసులు పరిశీలించగా.. గూగుల్‌ హిస్టరీ చూసి ఖంగుతిన్నారు. నాగేంద్ర ఫోన్‌లో వందలాది నీలి చిత్రాలకు సంబంధించిన వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. అలాగే, శృంగార సామర్థ్యం పెంచుకునేందుకు అనేక మందుల కోసం నాగేంద్ర సెర్చ్‌ చేసినట్టు తెలిపారు. అయితే, ఈ కేసులో నిందితుడు నాగేంద్రను కస్టడీలోకి తీసుకునే యోచనలో పోలీసులు ఉన్నట్టు సమాచారం.

మరోవైపు.. నవ వధువు మృతిపై బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెను భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు డ్రామాలు ఆడుతున్నారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ కేసు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)