Breaking News

కుక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పాలంట!

Published on Wed, 12/11/2024 - 05:29

తిరుపతి క్రైం/తిరుపతి కల్చరల్‌: మానవత్వం మరిచి పెంపుడు కుక్కను రాక్షసంగా వేట కొడవళ్లతో నరికి చంపిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే.. కుక్క తల్లిదండ్రుల పేర్లు చెప్పాలంటూ తిరుపతి పోలీసులు వెటకారంగా మాట్లాడారని తిరుపతికి చెందిన లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. 

ఈ నెల 6వ తేదీ సాయ­ం­త్రం తమ పెంపుడు కుక్క(టావీు)ను ఇద్దరు వ్యక్తులు దారుణంగా నరికి చంపేయడంతో  పోలీ­సులకు ఫిర్యాదు చేశామని తెలి­పారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. తమతో వెటకారంగా మాట్లాడుతూ చుల­కనగా వ్యవహరించారని లావణ్య వాపోయారు. 

కుక్కను చంపిన వారికి వత్తాసు పలుకుతూ.. రూ.2 లక్షలు ఇస్తారు సెటిల్‌మెంట్‌ చేసుకోవాలంటూ ఒత్తిడి చేశారని చెప్పారు. తానే రూ.2 లక్షలు ఇస్తానని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటారా అని పోలీసులను లావణ్య ప్రశ్నించారు. ఈ సమావేశంలో హెల్పింగ్‌ హ్యాండ్స్‌ ఫర్‌ యానిమల్స్‌ చైర్మన్‌ దివ్యారెడ్డి పాల్గొన్నారు.

ఇద్దరు నిందితుల అరెస్టు..
టామీ హత్యకు సంబంధించి ఇద్దరు నిందితులను తిరుపతి ఈస్ట్‌ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఈ వివరాలను ఈస్ట్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ సీఐ రామకృష్ణ మీడియాకు వెల్లడించారు. ఆ వివరాలు.. శంకర్‌ కాలనీకి చెందిన లావణ్య ఈనెల 6న బయటకు వెళ్తూ తన కుమార్తె గ్రీష్మతో పాటు టామీని స్కావెంజర్స్‌ కాలనీలోని తన మామయ్య ఆనందయ్య ఇంట్లో వదిలి వెళ్లారు. 

అదేరోజు సాయంత్రం 5.30 గంటల సమయంలో కుమార్తె గ్రీష్మ.. లావణ్యకు ఫోన్‌ చేసి తాతయ్య ఎదురింట్లో ఉన్న శివకుమార్, సాయికుమార్‌ టామీని చంపేశారని తెలిపింది. శివకుమార్‌ ఇంటి వైపు టామీ చూసి అరుస్తుండడంతో.. సాయికుమార్‌ రాయితో కొట్టాడని.. ఆ వెంటనే శివకుమార్‌ కత్తితో టామీని నరికి చంపేశాడు. లావణ్య ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశామని సీఐ తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)