Breaking News

వీఆర్‌ కూడా పోస్టింగేనా.. జీతాలేవి మరి..!

Published on Sat, 08/02/2025 - 02:13

సాక్షి, అమరావతి: ‘పోలీసు శాఖలో వేకెన్సీ రిజర్వ్‌(వీఆర్‌)లో ఉండటం కూడా పోస్టింగే. వీఆర్‌ అన్నది శాంక్షన్‌ పోస్టే’ అని మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా చేసిన వ్యాఖ్యలపై ఆ శాఖ సిబ్బంది, అధికారులు వారి కుటుంబ సభ్యులు విస్మయం వ్యక్తం చేశారు. ‘వీఆర్‌లో ఉండటం కూడా పోస్టింగే అయితే... మరి జీతాలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్ని­స్తున్నారు. 

చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్‌ కుట్రలతో దేశ చరిత్రలోనే ఎన్నడూలేని రీతిలో భారీగా ఐపీఎస్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బందికి పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తుండడాన్ని అత్యున్నతాధికారి అయిన డీజీపీ గుప్తా బహిరంగంగా సమరి్థంచడంపై మండిపడుతున్నారు. పోలీసులు ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మల్లా పనిచేయాలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం డీజీపీ గుప్తా వ్యాఖ్యలు ఆ శాఖలో హాట్‌టాపిక్‌గా మారాయి.

వేధించడం ఏవిధంగా సమర్థనీయం డీజీపీ..!?
పోలీసుల సంక్షేమం, గౌరవాన్ని పరిరక్షించాల్సిన డీజీపీ గుప్తా మాత్రం చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్‌ కుట్రను వెనకేసుకురావడంపై పోలీసువర్గాలు గళం విప్పుతున్నాయి. వీఆర్‌ శాంక్షన్‌ పోస్టే అయితే వారికి ప్రతినెలా జీతం ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నిస్తున్నాయి. కనీసం ఆయన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఈ ఐదు నెలల్లో అయినా వీఆర్‌లో ఉన్న పోలీసు అధికా­రు­లకు జీతాలు చెల్లించారా.. అని సూటి­గా ప్రశ్నలు సంధిస్తున్నాయి. 

ప్రభుత్వంలో ఏ ఇతర శాఖలో లేని రీతిలో భారీ సంఖ్యలో అధికారులను వెయిటింగ్‌­లో ఉంచడం, జీతాలు చెల్లించకుండా వేధించడం ఏవిధంగా సమర్థనీయ­మో డీజీపీ గుప్తానే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాయి.  ప్రభుత్వ పెద్దల చేతుల్లో పావుగా మారిన డీజీపీ కనీసం ఇలాంటి వ్యాఖ్య­లు బహిరంగంగా చేయకుండా ఉండాల్సిందని, పోలీసులు కీలు బొమ్మలు కాదని అభిప్రాయపడుతున్నాయి. వీఆర్‌లో పోలీసు అధికారులకు పోస్టింగులు ఇప్పించే బాధ్యత తీసుకోలేకపోయినా కనీసం వారికి నైతిక మద్దతు కూడా ఇవ్వకపోవడం డీజీపీ స్థాయి అధికారికి తగదని విమర్శిస్తున్నాయి.  

199 మంది పోలీసు అధికారులకు వీఆర్‌!
దేశ చరిత్రలోనే ఎన్నడూలేని స్థాయిలో వేధింపులు గత ఏడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐపీఎస్, ఇతర పోలీసు అధికారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. ఏకంగా 24 మంది ఐపీఎస్‌ అధికారులతోపాటు అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు కలిపి మొత్తం మీద 199 మందికి పోస్టింగులు ఇవ్వకుండా వీఆర్‌లో ఉంచింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత భారీ సంఖ్యలో పోలీసు అధికారులను వీఆర్‌లో ఉంచలేదు. 

నెలల తరబడి పోలీసు అధికారులను అవమానానికి గురి చేసింది. వారికి జీతాలు చెల్లింపు నిలిపివేసింది. అంతే కాదు వీఆర్‌లో ఉన్న ఐపీఎస్‌ అధికారులు ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు డీజీపీ కార్యాలయంలో  సంతకం చేయాలని, వెయిటింగ్‌ హాల్లో రోజంతా నిరీక్షించి సాయంత్రం 5 గంటలకు సంతకం చేసి వెళ్లాలని ఆదేశాలు జారీ చేయడం విభ్రాంతి కలిగించింది. 

ఇప్పటికీ  ఐపీఎస్‌ అధికారులు కొల్లి రఘురామ్‌రెడ్డి, వై.రవిశంకర్‌రెడ్డి, పి.జాషువా, వై.రిషాంత్‌ రెడ్డిలతోపాటు పెద్ద సంఖ్యలో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు వీఆర్‌లోనే ఉన్నారు. పోలీసు అధికారులను దీర్ఘకాలం వీఆర్‌లో ఉంచొద్దని రాజస్థాన్‌ హైకోర్టు కూడా ఇటీవల తీర్పు/నిచ్చింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్‌ కుట్రతో వారికి పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తోంది.  

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)