Breaking News

వస్త్ర వ్యాపారిపై దాడికి వ్యాపార లావాదేవీలే కారణం

Published on Sat, 07/08/2023 - 04:08

విజయవాడ స్పోర్ట్స్‌:  ఇటీవల విజయవాడలో వస్త్ర వ్యాపారిపై ఓ దుకాణం యజమాని దాడికి పాల్పడిన ఘటనలో ఎలాంటి రాజకీయ కోణం లేదని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. నిందితులకు రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదని, వ్యాపార లావాదేవీలే ఘటనకు కారణమని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఓ మీడియాలో వెలువడ్డ కథనాల్లో నిజం లేదని, అసత్యాలను వ్యాప్తి చేయవద్దని సూచించారు. ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ టీకే రాణా శుక్రవారం రాత్రి మీడియాకు వెల్లడించారు. 

చెక్కు చెల్లకపోవడంతో.. 
ధర్మవరానికి చెందిన హోల్‌సేల్‌ వస్త్ర వ్యాపారి అన్ని ప్రాంతాలకు వ్రస్తాలను సరఫరా చేస్తుంటారు. విజయవాడ పటమటలోని ఆలయ సిల్‌్క్స షాపు యజమానికి గతేడాది డిసెంబర్‌లో రూ.2.34 లక్షల విలువ చేసే వ్రస్తాలను సరఫరా చేశారు. దీనికి సంబంధించిన చెక్కు చెల్లకపోవడంతో డబ్బులివ్వాలని  ఆలయ సిల్‌్క్స యజ మాని గుడవర్తి అవినాష్‌ గుప్తాను పలుమార్లు ఫోన్‌లో కోరారు.

ఈ క్రమంలో డబ్బులు వసూలు చేసుకునేందుకు తన స్నేహితుడితో కలిసి ఈ నెల రెండో తేదీన విజయవాడ వచ్చారు. దుకాణం వద్ద ఘర్షణ చోటు చేసుకోవడంతో ఆలయ సిల్‌్క్స యజమాని అవినాష్ గుప్తా, సూపర్‌వైజర్‌ చీవేళ్ల నాగేశ్వరరావు, మరో వ్యక్తి కలసి వస్త్ర వ్యాపారిని, అతడి స్నేహితుడిని చేతులతో కొట్టారు.

దుస్తులు విప్పించి నగ్నంగా నాలుగు గంటల పాటు బంధించారు. ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ ఘటనపై శుక్రవారం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు గుడవర్తి అవినాష్గుప్తా, నాగేశ్వరరావును అరెస్ట్‌ చేశారు. మరో వ్యక్తిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది.  

తెనాలిలో అలాంటి నాయకులెవరూ లేరు..
ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ 
తెనాలి: వస్త్ర వ్యాపారిపై తెనాలికి చెందిన వైఎస్సార్‌ సీపీ అవినాష్‌ గుప్తా జులుం ప్రదర్శించారంటూ ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంలో నిజం లేదని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి కొల్లిపరలో ఎమ్మెల్యే శివకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీతో అతడికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అలాంటి వారికి తమ పార్టీలో స్థానం ఉండదని, తప్పు చేస్తే సీఎం జగన్‌ ఏమాత్రం ఉపేక్షించరని స్పష్టం చేశారు.

2011లో పారీ్టలో చేరిన తాను అవినాష్‌ గుప్తా అనే వ్యక్తిని ఎన్నడూ చూడలేదన్నారు. ఎల్లో మీడియా కథనాలు వికృత చేష్టలకు నిదర్శమన్నారు. చంద్రబాబు హయాంలో మహిళలపై లెక్కలేనన్ని దాడులు, అఘాయిత్యాలు జరిగాయని పేర్కొన్నారు.

ఇసుక దోపిడీని అడ్డుకున్నందుకు జుత్తు పట్టుకుని ఎమ్మార్వో వనజాక్షిపై దాడికి పాల్పడ్డ చింతమనేని ప్రభాకర్‌పై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ప్రోత్సహించారని గుర్తు చేశారు. విజయవాడలో టీడీపీ నేత వినోద్‌ జైన్‌ ఓ మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడి బాధితురాలి ఆత్మహత్యకు కారణమైన ఉదంతాన్ని ప్రజలు మరచిపోలేదని చెప్పారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)