Breaking News

బాలకృష్ణపై విమర్శలు.. వైఎస్సార్‌సీపీ మహిళా నేతపై కేసు

Published on Sun, 09/28/2025 - 07:11

చిలమత్తూరు/నగరంపాలెం (గుంటూరు వెస్ట్‌): సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లపై కూటమి ప్రభుత్వ వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. న్యాయస్థానాలు ఎంత హెచ్చరించినా ఖాకీలు మాత్రం బేఖాతరు చేస్తున్నారు. తాజాగా, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణను విమర్శించినందుకు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు నాగమణిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు.

సినీనటుడు చిరంజీవితోపాటు మాజీ సీఎం జగన్‌పై అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుపడుతూ శుక్రవారం నాగమణి సోషల్‌ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. దీనిపై టీడీపీ మహిళా విభాగం నాయ­కులు హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హిందూపురం ఒకటో పట్టణ పోలీసులు ఆమెపై బీఎన్‌ఎస్‌ 196(1),(ఎ), 353(2), 61(2), 351(4), బీఎన్‌ఎస్, 67 ఐటీఏ 2000–08 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అలాగే, సీఎంపై అసభ్యకర వ్యాఖ్యలు చేశా­రంటూ టీడీపీ నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక మెడికల్‌ రిప్రజెంటేటివ్‌పై కేసు నమోదు చేసి, అరెస్ట్‌ చేసినట్లు గుంటూరు సీఐడీ సైబర్‌ క్రైం ఎస్పీ డాక్టర్‌ కేవీ శ్రీనివాస్‌ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలానికి చెందిన గడ్డం శివప్రసాద్‌(మెడికల్‌ రిప్రజెంటేటివ్‌) ఫేస్‌బుక్‌లో సీఎంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు గుంటూరు వికాస్‌నగర్‌లోని టీడీపీ నాయకుడు కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు.

సీఐడీ డీజీపీ సూచనల మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. ఈ నెల 26న ధర్మవరం టౌన్‌లో గడ్డం శివప్రసాద్‌ను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. కాగా, దర్యాప్తు చేసి అతడిని సీబీసీఐడీ కోర్టు ముందు హాజరుపరచగా.. కోర్టు శివప్రసాద్‌ను 35 బీఎన్‌ఎస్‌ఎస్‌ కింద నోటీసులు ఇచ్చి విడుదల చేయాల్సిందిగా ఆదేశించింది.    

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు