Breaking News

పోలీసులం.. ఏదైనా చేసే హక్కు ఉంది!

Published on Fri, 12/12/2025 - 03:32

తెనాలి అర్బన్‌: ప్రశాంతంగా ఉండే గుంటూరు జిల్లా తెనాలిలో ‘పోలీసుల అత్యుత్సాహంవల్ల’ గురువారం తీవ్ర రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. టుటౌన్‌ సీఐ రాములు నాయక్‌ పోలీసులతో  మాజీ శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్‌ ఇంటికి చేరుకుని, మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి ఇక్కడ ఉన్నట్లు సెల్‌ టవర్‌ ద్వారా సమాచారం ఉందని, ఇంటిని సోదా చేయాలని డ్రైవర్, వాచ్‌మన్‌ వద్ద  హడావుడి చేయడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న శివకుమార్‌ ఇంటి బయటకు వచ్చి ఇదేమి పద్ధతని ప్రశ్నించారు. 

ఇంతలో మాట మార్చి మిమ్మల్ని హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నామని, నోటీసులు తీసుకోవాలంటూ హైడ్రామాకు తెరతీశారు. దీనిని వ్యతిరేకిస్తూ బయటకు నడుచుకుంటూ వస్తున్న ఆయనను సీఐ అడ్డుకుని బయటకు వెళ్ళేందుకు అనుమతి లేదని తెలిపారు.  తనను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని శివకుమార్‌ ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. తాము పోలీసులమని ఏదైనా చేసే హక్కు ఉంటుందని సీఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. 

వాగ్వివాదం నడుమ శివకుమార్‌  తన కారు ఎక్కటంతో సీఐ అడ్డుగా నిలుచున్నారు. అయితే అప్పటికే అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్న  వైఎస్సార్‌సీపీ శ్రేణులు శివకుమార్‌కు అండగా నిలిచాయి. ఈ క్రమంలో పోలీసుల వలయాన్ని ఆయన ఛేదించి గంగానమ్మపేటలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. చేసేదిలేక పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేయవద్దు: అన్నాబత్తుని
ఈ సందర్భంగా శివకుమార్‌ మీడియాతో మాట్లాడుతూ, ‘ప్రశాంతంగా ఉండే తెనాలి పట్టణాన్ని కలుషితం చేయాలని చూస్తే సహించేది లేదు. చంద్రబాబు ప్రభుత్వం పోలీసులతో రాజ్యం చేయాలని చేస్తే భయపడే వారు ఎవరు లేరు. ఈ వ్యవహారం మొత్తానికి మంత్రి నాదెండ్ల మనోహర్‌ బాధ్యత వహించాలి. 

వైఎస్సార్‌సీపీ పాలనలో ఇలాంటి వాటికి తావివ్వలేదు. పోలీసులు ఇదేవిధంగా వ్యవహరిస్తే వారి అక్రమాలను బయటపెట్టడానికి కూడా వెనుకాడబోము. ఎవరో మెప్పుకోసం పోలీస్‌ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఊరుకోం’ అని స్పష్టం చేశారు. పోలీసుల ప్రవర్తనపై మంత్రి మనోహర్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.   

Videos

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)