Breaking News

ఒంగోలు కూరగాయల మార్కెట్లో బీభత్సం

Published on Wed, 01/29/2025 - 05:39

ఒంగోలు సబర్బన్‌: ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని దామోదరం సంజీవయ్య ప్రధాన కూరగాయల మార్కెట్‌లో మంగళవారం పోలీసులు, నగర పాలక సంస్థ అధికారులు బీభత్సం సృష్టించారు. 2019 కరోనా సమయంలో ఉన్న బకాయిలు, వాటిపై వడ్డీ చెల్లించలేదంటూ దుకాణదారులపై విరుచుకుపడ్డారు. తెల్లవారు జామున నాలుగు గంటలకు దుకాణాలు తెరిచి కూరగాయలు, ఆకుకూరలు అమ్ముకుందామని అన్నీ సిద్ధం చేసుకునే సరికి ఒక్కసారిగా అధికారులు, పోలీసులు మార్కెట్‌ను చుట్టుముట్టారు. 

తాత్కాలికంగా వేసుకున్న షెడ్డులను కూలదోసేందుకు ముప్పేట దాడి మొదలెట్టారు. ఇదేం దౌర్జన్యం అని అడిగేలోగానే  దుకాణాలు నేలమట్టమయ్యాయి. ముందస్తు సమాచారంగానీ, నోటీసులు గానీ ఇవ్వకుండానే దాదాపు 200 మందికి పైగా మార్కెట్‌ను చుట్టుముట్టి భయానక వాతావరణాన్ని సృష్టించారు. కూరగాయలను బురదపాల్జేశారు. మార్కెట్‌లో దాదాపు 200కు పైగా హోల్‌సేల్, రిటైల్‌ దుకాణాలున్నాయి. 

ఇవి కాక మరో వంద వరకు చిరు వ్యాపారులు నేలపై పట్టలు పరుచుకుని కూరగాయలు అమ్ముకుంటుంటారు. ప్రతి దుకాణంలో రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు కూరగాయలను నష్ట పోయామంటూ బాధితులు లబోదిబోమంటున్నారు. దుకాణాలను ధ్వంసం చేసిన అధికారులు.. టీడీపీ సానుభూతిపరుల షాపుల జోలికి వెళ్లకపోవడంతో ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని చిరు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బాధితుల నిరసన  
కూరగాయల మార్కెట్లోని దుకాణాలపై ఉన్న పట్టలు, తడికలకు మంట పెట్టి అందులో కూరగాయలను దహనం చేసి బాధిత వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. అధికారుల చర్యలకు నిరసనగా కలెక్టర్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. 

కార్యాలయం ప్రధాన గేటు ముందు కూర్చొని అధికారుల చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కరోనా సమయంలో చెల్లించాల్సిన అద్దెబకాయిలకు రెండింతలు వడ్డీ వేసి మరీ కట్టాలని వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)