Breaking News

అంతర్రాష్ట్ర జలవివాదంగా పోలవరం–బనకచర్ల

Published on Sun, 10/12/2025 - 05:43

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చిన రోజు నుంచే.. గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారం కృష్ణా జలాల్లో తమకు అదనంగా దక్కే వాటా నీటిని వినియోగించుకుంటామని కేంద్రానికి మహారాష్ట్ర సర్కార్‌ తేల్చిచెప్పింది. ఈ మేరకు కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి వీఎల్‌ కాంతా­రావుకు మహారాష్ట్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ సవితా బోధేకర్‌ ఈ నెల 8న లేఖ రాశారు. పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో అదనంగా తమకు 14 టీఎంసీలు, కర్ణాటకకు 21 టీఎంసీలు వాడుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్‌ అనుమతిచ్చిందని గుర్తు చేశారు. 

గోదావరి నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 243 టీఎంసీలు తరలించేలా ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అనుమతిస్తే.. అదే రోజు నుంచి కృష్ణా జలా­లను గోదావరి ట్రిబ్యునల్‌ కేటాయించిన దామా­షా ప్రకారం అదనంగా వాడుకుంటామని తెలిపారు. ఇక ఎన్‌డబ్ల్యూడీఏ(జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) ప్రతిపాదించిన గోదావరి–కావేరి అనుసంధానానికి అనుమతిస్తే.. మళ్లించే గోదావరి జలాలను బట్టి దామాషా పద్ధతిలో కృష్ణా జలాలను అదనంగా వాడుకుంటామని స్పష్టం చేశారు. 

గోదావరి–బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి కోసం ప్రీ ఫీజుబులిటీ రిపోర్ట్‌(పీఎఫ్‌ఆర్‌)ను మే 22న సీడబ్ల్యూసీకి ఏపీ ప్రభుత్వం సమర్పించింది. జూన్‌ 11న మహా­రాష్ట్ర సర్కార్‌ అభిప్రాయాన్ని కోరుతూ సీడబ్ల్యూసీ లేఖ రాసింది. మహారాష్ట్ర స్పందిస్తూ.. పోలవరం–బనకచర్లకు అనుమతి ఇచ్చిన రోజు నుంచే గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారం కృష్ణా జలాల్లో తమకు వచ్చే అదనపు వాటా జలాలను వాడుకుంటామని స్పష్టం చేసింది. పోలవరం–బనకచర్లకు అనుమతి ఇస్తే.. తమ రాష్ట్రంలో దుర్భిక్ష ప్రాంతాలైన విదర్భ, మరఠ్వాడ ప్రాంతాలకు గోదావరి వరద జలాలను మళ్లించే ప్రాజెక్టులకు అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరింది. 

ఇక పోలవరం–బనకచర్లకు అనుమతి ఇచ్చిన రోజు నుంచే గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకా­రం కృష్ణా జలాలను అదనంగా 64.75 టీఎంసీలు వాడుకుంటామని కేంద్ర జల్‌ శక్తి శాఖకు గత నెల 17న కర్ణాటక సర్కార్‌ లేఖ రాసింది. గోదావరి జలాల్లో తమ వాటా 1,000 టీఎంసీలని.. పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని, అనుమతి ఇవ్వొద్దంటూ కేంద్రానికి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి జూన్‌ 19న లేఖ రాశారు. 

దీనిపై కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ స్పందిస్తూ.. బేసిన్‌ పరిధిలోని రాష్ట్రాలను సంప్రదించాకే ఆ ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకుంటామని తేల్చిచెప్పారు. ఈ మేరకు గత నెల 23న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖను ఏపీ పభుత్వం శనివారం మీడియాకు విడుదల చేసింది. ఈ పరిణామాలను బట్టి చూస్తే.. పోలవరం–బనకచర్ల అంతర్రాష్ట్ర జల వివాదంగా మారుతోందన్నది స్పష్టమవుతోంది.  

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)