Breaking News

టీడీపీ నేతల బెదిరింపులతో మహిళ ఆత్మహత్యాయత్నం

Published on Sun, 10/13/2024 - 13:59

ఒంగోలు టౌన్‌: ప్రేమపేరుతో వెంటపడి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఒక బాలికను గర్భిణిని చేశాడు దర్శి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడి కుమారుడు. తమకు న్యాయం చేయమంటూ వేడుకున్న బాధిత బాలిక కుటుంబ సభ్యులపై బెదిరింపులకు దిగడంతో భయాందోళనకు గురైన బాలిక తల్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఒంగోలులోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బాధిత బాలిక తండ్రి కథనం ప్రకారం.. 

కావలికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె కావలిలోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్‌ చదువుతుండగా, చిన్న కుమార్తె దర్శి సమీప గ్రామంలో అమ్మమ్మ దగ్గర ఉంటూ 7వ తరగతి చదువుకుంటోంది. కొద్దిరోజులుగా గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఏనిగంటి కోటేశ్వరరావు కుమారుడు వరుణ్‌ చౌదరి ప్రేమ పేరుతో బాలిక వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. శారీరకంగా లోబరుచుకొని గర్భిణిని చేశాడు. ఈ విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఆగస్టులో దర్శి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి వరుణ్‌ చౌదరిని అరెస్టు చేశారు.

రూ.50 వేలు ఇస్తా తీసుకొని వెళ్లు ...
బాలికను గర్భిణిని చేసిన వరుణ్‌ చౌదరి తండ్రి కొద్ది రోజులుగా రాజీ ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టాడని బాలిక తండ్రి చెబుతున్నారు. రాజంపల్లికి చెందిన తెలుగుదేశం నాయకులను మధ్యవర్తులుగా రాయబారానికి పంపించాడన్నారు. వారి ద్వారా డబ్బులు ఇస్తానంటూ ఆశ పెట్టాడని, అయితే ఇందుకు అంగీకరించలేదని, తమకు డబ్బులు ఏమీ వద్దని, తమ కూతురిని పెళ్లి చేసుకోవాలని కోరామన్నాడు. దాంతో అగ్గిమీద గుగ్గిలమైన కోటేశ్వరరావు రూ.50 వేలు ఇస్తా, తీసుకొని పోండి. పెళ్లి అంటే ఎదురు కేసు పెట్టి బాలికను, బాలిక తల్లిని బజారుకీడుస్తానంటూ రెచ్చి పోయాడని ఆరోపించాడు. 

చెప్పినట్లు విని రాజీకి వస్తే సరేసరి లేకపోతే ఇబ్బందులు పడతావంటూ బెదిరింపులకు దిగాడన్నాడు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కావలిలో తన ఇంటిపై దాడి చేసి కొట్టారాని వాపోయాడు. కేసులో రాజీ పడాలని, లేకుంటే నిన్ను, నీ భార్యను చంపుతామని బెదిరించి వెళ్లారని ఆరోపించాడు. వెంటనే బాలిక తండ్రి కావలి వన్‌టౌన్‌ సీఐకు ఫోన్‌ చేసి జరిగిన విషయం చెప్పామన్నాడు. వెంటనే ఎస్సై వచ్చి జరిగిన విషయం అడిగి తెలుసుకుని, చుట్టుపక్కల విచారించి వెళ్లారని తెలిపాడు.

బాలిక తల్లి ఆత్మహత్యా యత్నం..
ఈ ఘటనలతో బాలిక తల్లి భయాందోళనకు గురైంది. ఈ నెల 2వ తేదీ ఎలుకల మందు తిని ఆత్మహత్యకు ప్రయత్నించింది. వెంటనే ఆమెను కావలి ఆస్పత్రికి తరలించి వైద్యం చేశారు. మెరుగైన చికిత్స కోసం శుక్రవారం ఒంగోలులోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆమెను ఎమర్జన్సీ వార్డులో ఉంచి కృతిమ శ్వాస అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉందని, లివర్‌ చెడిపోయిందని, ప్లేట్‌లెట్స్‌ కూడా తగ్గిపోతున్నాయని, రక్తపోటు తరచుగా పడిపోతుందని వైద్యులు తెలిపారు. 

ఒకవైపున నిండా పద్నాలుగేళ్ల వయసు కూడా లేని కుమార్తె నిండు గర్భంతో ఉంది. చిన్న వయసు కావడంతో కాన్పు ప్రమాదం కావచ్చని, సిజేరియన్‌ చేసినా ప్రాణాలకు ముప్పు రావచ్చని వైద్యులు చెబుతున్నారని, మరోవైపు ఆత్మహత్యా యత్నం చేసిన భార్య చావు బతుకుల మధ్య పోరాడుతోందని బాలిక తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి అండ చూసుకునే కోటేశ్వరరావు రెచ్చి పోతున్నాడని ఆరోపిస్తున్నారు.

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)