Breaking News

రేపు ‘పీఎం కిసాన్‌’ తొలి విడత

Published on Mon, 06/17/2024 - 04:11

సాక్షి, అమరావతి: రైతన్నలకు ప్రధానమంత్రి కిసాన్‌ 17వ విడత సాయం పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకం కింద ఏటా మూడు విడతల్లో మొత్తం రూ.6 వేలు జమ చేస్తోంది. 2024–25 వ్యవసాయ సీజన్‌లో తొలి విడత పీఎం కిసాన్‌ సాయం కింద ఈ నెల 18వ తేదీన ఖాతాల్లోకి జమ చేయనుంది. మూడోసారి పగ్గాలు చేపట్టిన ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజే పీఎం కిసాన్‌ పెట్టుబడి సాయంపై తొలి సంతకం చేసి రైతుల పట్ల చిత్తశుద్ధి చాటుకున్నారు.

అన్నదాతలకు అండగా..
2018–19 నుంచి కేంద్రం పీఎం కిసాన్‌ పథకం ద్వారా పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. తొలి విడత సాయం మే–జూన్‌లో, రెండో విడత అక్టోబర్‌– నవంబర్‌లో, మూడో విడత జనవరి–ఫిబ్రవరిలో జమ చేస్తూ వస్తోంది. ఇప్పటివరకు 16 విడతల్లో దేశ వ్యాప్తంగా రూ.3.04 లక్షల కోట్లు జమ చేసిన కేంద్రం రాష్ట్రంలో అర్హులైన రైతులకు పీఎం కిసాన్‌ పథకం కింద రూ.14,717 కోట్లు అందచేసింది. 2024–25 సీజన్‌లో ఏపీలో 43.52 లక్షల మంది రైతుల ఖాతాల్లో సుమారు రూ.870 కోట్లు జమ చేయనుంది. ఇప్పటికే ఈ నిధులను కేంద్రం విడుదల చేసింది. యూపీ పర్యటనలో భాగంగా మంగళవారం పీఎం కిసాన్‌ 17వ విడత డబ్బులను ప్రధాని మోదీ నేరుగా బటన్‌ నొక్కి  రైతుల ఖాతాలకు జమ చేయనున్నారు.

ఐదేళ్లూ ఠంచన్‌గా ఇచ్చిన వైఎస్‌ జగన్‌
పీఎం కిసాన్‌తో పాటే గత ఐదేళ్లూ ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలోనే రైతన్నలకు తొలి విడత పెట్టుబడి సాయాన్ని అందజేసి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అండగా నిలిచింది. ఐదేళ్లలో 53.58 లక్షల మందికి రూ.34,288 కోట్లు పెట్టుబడి సాయంగా అందించి తోడుగా నిలిచింది. తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ.20 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. నూతన ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి వారం రోజులు గడుస్తోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్‌ సీజన్‌ ఊపందుకుంటోంది. ఈ సమయంలో అందించాల్సిన పెట్టుబడి సాయంపై ప్రభుత్వ పెద్దలు స్పందించకపోవడం పట్ల రైతన్నలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)