Breaking News

బెయిల్‌ ఇవ్వండి

Published on Sun, 08/04/2024 - 05:22

సాక్షి, అమరావతి: పోలింగ్‌ రోజున, ఆ మరుసటి రోజున తనపై రెంటచింతల, కారంపూడి పోలీసులు నమోదు చేసిన రెండు వేర్వేరు కేసుల్లో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్‌ సోమవారం విచారణ జరపనున్నారు. పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసి.. టీడీపీ ఏజెంట్‌ శేషగిరిరావుపై దాడి చేశారంటూ రెంటచింతల పోలీసులు రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. 

ఆ మరుసటి రోజు కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై దాడి చేసి గాయపరిచారంటూ కారంపూడి పోలీసులు మరో కేసు నమోదు చేశారు. అనంతరం పిన్నెల్లిని అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుల్లో బెయిల్‌ ఇవ్వాలంటూ ఆయన ఇటీవల గురజాల కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గురజాల కోర్టు రామకృష్ణారెడ్డి బెయిల్‌ పిటిషన్లను కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 

తనపై హత్యాయత్నం కింద నమోదు చేసిన కేసులు చెల్లవని.. అందుకు ఎలాంటి ఆధారాలు లేవని పిన్నెల్లి వివరించారు. రాజకీయ ప్రోద్భలంతో పోలీసులు తనను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. తాను జైలు నుంచి బయటకు రాకూడదని.. నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విన్నవించారు. 37 రోజులుగా జైల్లో ఉన్నానని.. పోలీసులు దర్యాప్తు కూడా పూర్తయ్యిందని.. బెయిల్‌ మంజూరు సందర్భంగా ఏ షరతు విధించినా కట్టుబడి ఉంటానన్నారు. తనకు బెయిల్‌ ఇవ్వాలని హైకోర్టును పిన్నెల్లి కోరారు.    

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)