Breaking News

మా సమస్యలన్నీ పరిష్కరించాల్సిందే

Published on Tue, 10/07/2025 - 05:18

లబ్బీపేట/పటమట (విజయవాడ తూర్పు): తమ సమస్యల పరిష్కారం కోసం పీహెచ్‌సీ వైద్యులు చేపట్టిన రిలే దీక్షలు మూడో రోజైన సోమవారం కూడా కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్‌లో నిర్వహిస్తున్న రిలే దీక్షల్లో వైద్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లపై స్పందించి.. స్పష్టమైన రాతపూర్వక హామీ ఇచ్చే వరకు ఆందోళనను విరమించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

చర్చలకు ఆహ్వానిస్తున్న ప్రభుత్వం.. తమ డిమాండ్ల పరిష్కారానికి మాత్రం స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని మండిపడ్డారు. పీహెచ్‌సీ వైద్యులు 20 ఏళ్లుగా ఎలాంటి పదోన్నతులు లేకు­ండా పనిచేస్తున్నారని.. తమతోపాటు ఇతర శాఖల్లో చేరిన వారు రెండు, మూడు పదోన్నతులు పొందారని వివరించారు. టైమ్‌ బౌండ్‌ ప్రమోషన్లు, ఇన్‌–సర్వీస్‌ పీజీ కోటా పునరుద్ధరణ వంటి డిమాండ్లు నెరవేర్చాలన్నారు.

వైద్యుల సమ్మెకు జీడీఏఏ మద్దతు 
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యుల సమ్మెకు తమ సంఘీభావం ప్రకటిస్తున్నామని జీడీఏఏ (గవర్నమెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌) కార్యదర్శి డాక్టర్‌ బాబ్జీ శ్యామ్‌కుమార్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పీహెచ్‌సీ వైద్యుల డిమాండ్లు నెరవేర్చాలని, డీఎంఈ వైద్యులకు బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఇప్పటికే వినతిపత్రం అందించామన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను బట్టి తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు.  

 

విజయవాడలో జరిగిన రిలే దీక్షలో పాల్గొన్న పీహెచ్‌సీ వైద్యులు 

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)