Breaking News

రిలే దీక్షలకు దిగిన పీహెచ్‌సీ వైద్యులు

Published on Sun, 10/05/2025 - 04:44

లబ్బీపేట (విజయవాడ తూర్పు): తమ దీర్ఘకాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యులు నిరవధిక సమ్మెకు దిగారు. గత ఏడాది ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేటివరకూ అమలుచేయకపోగా, వాటికి విరుద్ధంగా చర్యలు తీసుకోవడాన్ని నిరసిస్తూ విధులు బహిష్కరించిన వైద్యులు.. తాజాగా విజయవాడ ధర్నా చౌక్‌లో రిలే దీక్షలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం ప్రారంభించిన ఈ రిలే దీక్షలు తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకూ కొనసాగుతాయని అసోసియేషన్‌ నేతలు ప్రకటించారు.  

ప్రధాన డిమాండ్లు ఇవే.. 
⇒  అన్ని విభాగాల్లో 20 శాతం ఇన్‌సర్వీస్‌ పీజీ సీట్లు కొనసాగించాలి.  టైమ్‌»ౌండ్‌ ఉద్యోగోన్నతులు ప్రకటించాలి. డీసీఎస్, సీఎస్‌ ఉద్యోగోన్నతులకు కాలపరిమితి నిర్ణయించాలి. ఆ మేరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలి. 
⇒  గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న వైద్యులకు వెంటనే ట్రైబల్‌ అలవెన్స్‌ మంజూరుచేయాలి. 
⇒  సంచార వైద్యసేవలకు తక్షణమే సదుపాయాలు కలి్పంచాలి. వాయిదా పడిన వేతన పెంపును తక్షణమే అమలుచేయాలి.  

రోగులను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంలేదు.. 
రోగులను ఇబ్బంది పెట్టాలనేది తమ ఉద్దేశంకాదని, తమ సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్‌తోనే సమ్మెకు వెళ్లినట్లు తెలిపారు. తాము సమ్మెకు వెళ్తామని అధికారులకు ముందుగానే నోటీసులు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వం స్పష్టమైన లిఖితపూర్వక హామీ ఇచ్చేవరకూ తమ నిరసన కొనసాగుతుందని స్పష్టంచేశారు. 

ఆమోదయోగ్యమైన డిమాండ్లు సీఎం దృష్టికి
సాక్షి, అమరావతి: పీహెచ్‌సీ వైద్యుల డిమాండ్లలో ఆమోదయోగ్యమైన వాటిని సీఎం దృష్టికి తీసుకెళ్లి తగిన నిర్ణయం తీసుకుంటామని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. వెంటేనే వైద్యు­లు విధుల్లో చేరాలని కోరారు. శనివారం సత్యకుమార్‌ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాల­యంలో అధికారులతో సమావేశమయ్యారు. వారి డిమాండ్లను పరిశీలిస్తామన్నారు. ఇన్‌ సర్వీస్‌ కోటా, ఉద్యోగ సర్వీస్‌ డిమాండ్లను పరి­ష్కరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)