Breaking News

కొనసాగుతున్న పీహెచ్‌సీ వైద్యుల సమ్మె

Published on Thu, 10/02/2025 - 05:54

సాక్షి, అమరావతి: పీహెచ్‌సీ వైద్యుల సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలోని గ్రామీణ, గిరిజనప్రాంత ప్రజలకు ప్రత్యామ్నాయ వైద్యసేవల కల్పనలో ప్రభు­త్వం పూర్తిగా విఫలం అయింది. దీంతో గ్రామీణ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పీజీ వైద్యవిద్యలో ఇన్‌సర్వీస్‌ కోటా 20 శాతానికి పునరుద్ధరణ, పదోన్నతులు, అలవెన్స్‌ల మంజూరు వంటి డిమా­ండ్లతో సోమవారం నుంచి పీహెచ్‌సీ వైద్యులు చేపట్టిన సమ్మె బుధవారం మూడోరోజు కూడా కొనసాగింది. 

శ్రీసత్యసాయి జిల్లా నుంచి శ్రీకాకుళం వ­ర­కు అన్ని జిల్లాల్లో వైద్యులు ఆందోళన కార్యక్ర­మా­లు చేపట్టారు. కలెక్టరేట్‌లు, డీఎంహెచ్‌వో కా­ర్యాలయాల ముందు ఆందోళనలు, ర్యాలీలు చేశా­రు. ఉన్న­తాధికారులకు వినతిపత్రాలిచ్చారు. జిల్లాల్లో మహిళా వైద్యులు వినూత్న పద్ధతుల్లో నిరసన తెలుపుతూ వీడియోలు చిత్రీకరించారు. ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారా­యి.  

దగాచేసిన ప్రభుత్వం 
గతేడాది ఇదే మాదిరిగా సమ్మె చేసినప్పుడు ప్రభు­త్వం దిగివచ్చి చర్చలు జరిపినట్టు వైద్యులు గుర్తుచేశారు. అప్పట్లో 20 శాతం ఇన్‌సరీ్వస్‌ కోటాను వైద్యవిద్య పీజీలో అన్ని బ్రాంచ్‌లకు వర్తింపజేసినట్టు తెలిపారు. ఇదే విధానాన్ని మరో రెండు, మూడేళ్లు కొనసాగించాలని కోరగా సరే అని ప్రభుత్వం హామీ ఇచి్చందని గుర్తుచేశారు. అయితే 10 నెలలు కూడా తిరగకుండానే మళ్లీ 20 శాతం కోటాను 15 శాతానికి కుదించి కూటమి ప్రభుత్వం దగా చేసిందన్నారు. ఇది కూడా కేవలం ఏడు బ్రాంచ్‌లకు పరిమితం చేశారని మండిపడ్డారు.  

చర్చలు విఫలం  
అధికారుల నుంచి స్పష్టమైన హామీలు రాకపోవడంతో తమ సమ్మెను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించినట్టు వైద్యుల సంఘం ప్రతినిధి డాక్టర్‌ వినోద్‌ తెలిపారు. గురువారం ఛలో విజయవాడ చేపడతామని తెలిపారు. శుక్రవారం నుంచి ఆమరణ దీక్షలకు పూనుకుంటామని స్పష్టం చేశారు. 

తమ సమస్యలు పరష్కరించేవరకూ వెనకడుగు వేసేది లేదన్నారు. వైద్యులు చేస్తున్న సమ్మెకు కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్, కార్యదర్శి సందీప్‌ ప్రకటన విడుదల చేశారు.

సీఏఎస్‌(జనరల్‌) వైద్యుల సమ్మె నోటీస్‌   
పీహెచ్‌సీ వైద్యులు తరహాలోనే డైరెక్టర్‌ సెకండరీ హెల్త్‌ పరిధిలో పని చేస్తున్న సీఏఎస్‌(జనరల్‌) వైద్యులు బుధవారం ప్రభుత్వానికి సమ్మె నోటీసు  ఇచ్చారు. ఇన్‌ సర్వీస్‌ కోటా ఇతర సమస్యలు పరిష్కరించకపోతే శుక్రవారం నుంచి డెప్యుటేషన్‌పై పీహెచ్‌సీల్లో ఓపీ సేవలు, సీహెచ్‌సీల్లో సాధారణ సేవలు అందించేది లేదన్నారు. 6 నుంచి ఎమర్జెన్సీ సేవలు నిలిపేస్తామని ప్రకటించారు. 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)