Breaking News

కొనసాగుతున్న పీహెచ్‌సీ వైద్యుల రిలే దీక్షలు

Published on Mon, 10/13/2025 - 05:04

లబ్బీపేట (విజయవాడ తూర్పు): తమ సమస్యలు పరిష్కరించాలని కోరు­తూ ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ ధర్నా చౌక్‌లో పీహెచ్‌సీ వైద్యులు చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం ఎనిమిదో రోజుకు చేరాయి. ఏపీ ప్రైమరీ హెల్త్‌ సెంటర్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ రిలే దీక్షల్లో రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి వైద్యులు పాల్గొంటున్నారు. అసోసియేషన్‌ పిలుపు మేరకు రాష్ట్రంలోని 2,700 మంది వైద్యులు విధులు బహిష్కరించి దీక్షలు చేపట్టారు.

తమ డిమాండ్‌లను ప్రభుత్వం పరిష్కరించే వరకూ ఆందోళనను విరమించే­ది లేదని స్పష్టం చేస్తున్నారు. నోషనల్‌ ఇంక్రిమెంట్స్, గిరిజన ప్రాంతాల్లో ప­ని­­చేసే వారికి అదనపు భత్యం, టైమ్‌బాండ్‌ పదోన్నతులు, స్కేల్స్‌ వర్తింపు వంటి అనేక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ రిలే దీ­క్ష­ల్లో అసోసియేషన్‌ నాయకులు డాక్టర్‌ వినోద్‌కుమార్, డాక్టర్‌ రవీంద్రనాయక్, డాక్టర్‌ గోపినాథ్, డాక్టర్‌ కిషోర్‌తో పాటు, వందలాది వైద్యులు పాల్గొన్నారు.

నేటి నుంచి సిబ్బంది నిరసన..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీహెచ్‌సీలు, సెకండరీ హెల్త్‌ సెంటర్స్‌లోని వైద్య సి­బ్బ­ంది సోమవారం నుంచి వైద్యులకు మద్దతుగా నల్లబ్యాడ్జిలు ధరించి వి­ధు­లకు హాజరుకానున్నారు. లంచ్‌ సమయంలో సమావేశాలు, నిరసనలు తె­లి­పేందుకు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రంలోని వైద్యులతో పాటు, వైద్య సి­బ్బ­ంది కూడా నిరసనలో పాల్గొంటారని డాక్టర్స్‌ అసోసియేషన్‌ నేతలు తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)