Breaking News

చర్చలు విఫలం

Published on Sat, 10/18/2025 - 05:23

సాక్షి, అమరావతి : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) వై­ద్యు­లతో రాష్ట్ర ప్రభు­త్వ చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మె యథావిధిగా కొనసాగిస్తున్నట్లు పీహెచ్‌సీ వైద్యుల సంఘం ప్రకటించింది. మెడికల్‌ పీజీ ఇన్‌సర్వీస్‌ కోటా, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు ఇతర సమస్యలపై వైద్యులు సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. వీరి సమ్మెతో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలు స్తంభించగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 

ఈ నేపథ్యంలో.. శుక్రవారం సచివాలయంలో వైద్యుల సంఘంతో ప్రభుత్వం మరోమారు చర్చలు జరిపింది. వైద్యశాఖ కార్యదర్శి సౌరబ్‌ గౌర్‌ వైద్యుల సంఘం ప్రతినిధులతో మాట్లాడారు. గతంలో వెల్లడించినట్లే క్లినికల్‌ స్పెషాలిటీల్లో ఈ విద్యా సంవత్సరానికి 20 శాతం ఇన్‌సర్వీస్‌ కోటా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ట్రైబల్‌ అలవెన్సు, నోషనల్‌ ఇంక్రిమెంట్లు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు, సర్వీసు వ్యవహారాలకు సంబంధించిన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలమని.. వెంటనే విధుల్లో చేరాలని వైద్యులను కోరారు. 

అయితే, వైద్యులు మాత్రం 2030 వరకూ 20 శాతం ఇన్‌సర్వీస్‌ కోటా కొనసాగించాలని పట్టుబట్టినట్లు తెలిసింది. ఇందుకు ప్రభుత్వం ససేమిరా అనడంతో 2026–27 నుంచి కనీసం మూడేళ్ల పాటు క్లినికల్‌ స్పెషాలిటీల్లో 15 శాతం కోటా కల్పించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై వచ్చే నెలలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని గౌర్‌ చెప్పారు. పాలసీ రూపకల్పనలో సంఘం ప్రతినిధులను భాగస్వామ్యం చేస్తామన్నారు. 

రెండ్రోజుల్లో తదుపరి కార్యాచరణ 
ఈ ఒక్క ఏడాదికే 20 శాతం కోటా కల్పిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనతో పీహెచ్‌సీ వైద్యులు ఏకీభవించలేదు. ఏటా కోటాపై రివ్యూ చేస్తూపోతే తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకూ వెనక్కి తగ్గబోమని పీహెచ్‌సీ వైద్యుల సంఘం కోశాధికారి డాక్టర్‌ వినోద్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 

తమ ఆందోళనలను తీవ్రతరం చేయనున్నామని వెల్లడించారు. ఇప్పటికే వైద్యశాఖలోని 24 సంఘాలు తమ సమ్మెకు మద్దతు ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. వారందరినీ భాగస్వామ్యం చేసుకుని సమ్మెను మరింత ఉధృతం చేస్తామన్నారు. రెండ్రోజుల్లో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)