Breaking News

వంద రోజుల్లో వైద్యులను రోడ్డుపై నిలబెట్టారు

Published on Sat, 09/21/2024 - 03:55

సాక్షి, అమరావతి/తిరుపతి తుడా: వంద రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం వైద్యులను రోడ్ల మీదకు లాగిందని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) వైద్యులు మండిపడ్డారు. వంద రోజుల్లో గొప్ప కార్యక్రమాలు చేశామని ప్రకటనలు చేసుకుంటున్న ఈ ప్రభుత్వం కోవిడ్‌లో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన వైద్యులను అవమా­నాలకు గురిచేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో పెద్దఎత్తున వైద్యులను నియమించి, పీహెచ్‌సీలను బలోపేతం చేస్తే ఈ ప్రభుత్వం వైద్యులపై వేధింపులకు దిగుతోందన్నారు. 

వైద్య విద్యలో ఇన్‌సర్వీస్‌ కోటా కుదింపునకు సంబంధించిన జీవో 85కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా డీఎంహెచ్‌వో కార్యాల­యాల ముందు వైద్యులు శుక్రవారం శాంతియుత నిరసనలు చేపట్టారు. విజయ­వాడ­లో నిరసన కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వ­కపోవడంతో వైద్యులందరు తమ జిల్లాలకు గురువారం వెళ్లిపోయినట్లు పీహెచ్‌సీ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ యూనస్‌మీర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 

వచ్చే సోమవారం ఛలో విజయవాడ 2.0 కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే రెండుసార్లు చర్చలు నిర్వహించిన్పటికీ తమ డిమాండ్‌లు నెరవేరలేదని, మళ్లీ చర్చలకు పిలిచి, డిమాండ్లను నెరవేర్చే వరకూ విజయవాడలో నిరసన తెలుపుతామన్నారు. శుక్రవారం ఉదయం నుంచి డీఎంహెచ్‌వో కార్యాలయాల ముందు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వైద్యులపై కేసులు పెడతామని డీఎంహెచ్‌వోలు బెదిరించారని చెప్పా­రు. 

అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా శనివారం కూడా డీఎంహెచ్‌వోల కార్యాలయాల ముందు నిరసన కార్య­క్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్యులందరూ కలిసి వేధింపులకు పాల్పడిన డీఎంహెచ్‌వోల కార్యాలయాల ముందు పెద్దఎత్తున ఆందోళనకు దిగుతామని తేల్చి చెప్పారు.

సమస్యలు పరిష్కరించే వరకు నిరసన
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించడం దారుణమని ఆంధ్రప్రదేశ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారుల సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ చత్రప్రకాష్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద డాక్టర్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కారంఅయ్యే వరకు శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తామన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)