విశాఖలో మాంజా టెర్రర్

Published on Wed, 01/14/2026 - 18:27

విశాఖ: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఎగురేసే గాలిపటాల కారణంగా మాంజా(అత్యంత పదునుగా ఉండే దారం) దడపుట్టిస్తోంది. ఈ మాంజా బారిన పడి అనేక మంది గాయాల బారిన పడుతున్నారు. తాజాగా విశాఖలో మాంజా కారణంగా ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఉదంతం వెలుగుచూసింది. 

మాజీ సైనిక ఉద్యోగి నోటిని మాంజా కోసేసింది. మాంజా దారం తగిలి వెంకట్రావు అనే మాజీ సైనికోద్యోగి గాయపడ్డారు. రెండు పెదవుల మధ్య తీవ్ర గాయమైంది. దాంతో తీవ్ర రక్త స్రావంతో  ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. నోటికి రుండు వైపులా కుట్ల వేసేంతంగా  గాయమైంది. మధురవాడలో బైక్ పై కొడుకుతో కలిసి ప్రయాణిస్తుండగా ఇది చోటు చేసుకుంది. 

తెలంగాణలో ఘటనలు
జనవరి 13 వ తేదీన  ఓ  పోలీసు అధికారి విధుల్లో భాగంగా బైక్‌పై వెళ్తుండగా మెడకు చైనీస్ మాంజా తగిలి తీవ్ర గాయపడ్డాడు. రక్తస్రావం ఎక్కువగా జరిగి ఆసుపత్రికి తరలించారు.

నిజామాబాద్: ఒక రైతు గాలిపటాల దారంలో చిక్కుకుని తీవ్ర గాయపడ్డాడు.

మాంజా వల్ల జరుగుతున్న గాయాలు, మరణాలపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్‌గా స్పందించింది. ఫిబ్రవరి 26లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని పోలీస్‌ విభాగానికి ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఘటనలు
సంక్రాంతి సీజన్‌లో: చైనీస్ మాంజా కారణంగా పదుల సంఖ్యలో గాయాలు నమోదయ్యాయి.
పోలీసుల చర్యలు: "సీజ్ ది కైట్" ఆపరేషన్‌లో మాంజా విక్రయాలు, వినియోగంపై కేసులు నమోదు చేశారు. కానీ అమలు కఠినంగా జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి.

ప్రమాదాల తీవ్రత
గాజు పొడి, లోహపు పదార్థాలు కలిపి తయారు చేస్తారు. ఇవి చర్మాన్ని, గొంతును కోసేంత పదునుగా ఉంటాయి.
ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు, వందలాది మంది గాయపడ్డారు.
నిషేధం ఉన్నప్పటికీ: మార్కెట్లో మాంజా సులభంగా లభిస్తోంది. పోలీసులు అరెస్టులు చేసినా, వినియోగం తగ్గడం లేదు

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)