Breaking News

ఫిర్యాదుదారే తప్పుడు సాక్ష్యం ఇస్తారా?

Published on Sun, 02/04/2024 - 05:17

సాక్షి, అమరావతి: ఓ అధికారి తన నుంచి లంచం తీసుకున్నారంటూ ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తే, అందుకు విరుద్ధంగా సాక్ష్యం (హోస్టైల్‌) చెప్పడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆ వ్యక్తి తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు ఐపీసీ సెక్షన్లు 191, 193 కింద ప్రాసిక్యూట్‌ చేయాలని విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆదేశించింది. ఈ మేరకు అతడిపై విజయవాడ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్కు మూడు వారాల్లోగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించింద

కాగా అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్‌)లోని సెక్షన్‌ 7, సెక్షన్‌ 13(1)(డీ), 13(2) కింద అధికారికి ఏసీబీ కోర్టు విధించిన శిక్షను హైకోర్టు సవరించింది. సెక్షన్‌ 7 కింద లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే సరిపోదని, అధికారిని పట్టుకున్న తేదీకి ముందు, లేదా ఆ పట్టుకున్న రోజుకు, ఫిర్యాదుదారుకు సంబంధించి అధికారికంగా మేలు (అఫీషియల్‌ ఫేవర్‌) అన్నది పెండింగ్‌లో ఉండాలంది.

అయితే సదరు అధికారిని పట్టుకునే రోజుకు ఫిర్యాదుదారు విషయంలో అధికారిక మేలనేది పెండింగ్‌లో ఉన్నట్లు ఏసీబీ నిరూపించలేదని, అందువల్ల సెక్షన్‌ 7 వర్తించదని తేల్చిచెప్పింది. అందువల్ల సెక్షన్‌ 7 కింద అధికారికి ఏసీబీ ప్రత్యేక కోర్టు విధించిన శిక్షను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడినందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు విధించిన శిక్షను ఖరారు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు ఇటీవల తీర్పు వెలువరించారు. 

ఇదీ నేపథ్యం... 
ఎస్‌.చంద్రశేఖర్‌ 2003 వరకు మచిలీపట్నం పురపాలక కార్యాలయంలో శానిటరీ అండ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. ఈ క్రమంలో చంద్రశేఖర్‌ తనను రూ.5 వేలు లంచం అడిగారంటూ ఎం.మురళీధర్‌ అనే వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇంటి వద్ద లంచం తీసుకుంటుండగా చంద్రశేఖర్‌ను ఏసీబీ పట్టుకుంది. ఆయనపై పీసీ యాక్ట్‌లోని సెక్షన్‌ 7, సెక్షన్‌ 13(1)(డీ), 13(2) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఫిర్యాదుదారు అయిన మురళీధర్‌ను కూడా కోర్టు విచారించింది. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌పై తాను చేసిన ఆరోపణలన్నీ తప్పని మురళీధర్‌ సాక్ష్యం చెప్పారు.

అందరినీ విచారించిన అనంతరం ఏసీబీ కోర్టు చంద్రశేఖర్‌కు సెక్షన్‌ 7 కింద ఏడాది సాధారణ జైలుశిక్ష, రూ.1,000 జరిమానా, సెక్షన్‌ 13 కింద ఏడాది జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ 2007లో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ చంద్రశేఖర్‌ అదే ఏడాది హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌ ఇటీవల న్యాయమూర్తి జస్టిస్‌ ఏవీ రవీంద్రబాబు ముందు తుది విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఫిర్యాదుదారు తప్పుడు సాక్ష్యం చెప్పారని ఆయనకు తెలిసింది. ఇలా చేసినందుకు ఫిర్యాదుదారు అయిన మురళీధర్‌పై ఏసీబీ కోర్టు.. చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసి ఉండాల్సిందని న్యాయమూర్తి తన తీర్పులో అభిప్రాయపడ్డారు. తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు ఫిర్యాదుదారు ప్రాసిక్యూషన్‌ ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)