Vizag: విశాఖ రైల్వేస్టేషన్‌లో వ్యక్తి హల్‌చల్‌..

Published on Fri, 01/12/2024 - 11:30

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. రైల్వేస్టేషన్‌లో రూఫ్‌ టాప్‌పైకి ఎక్కి కరెంట్‌ తీగలను పట్టుకుంటాను అంటూ అక్కడున్న వారిని బెదిరించాడు. దీంతో, ప్రయాణికులు హడిలిపోయారు. రైల్వేస్టేషన్‌లో రద్దీ ఎక్కువగా ఉండటంతో టెన్షన్‌ వాతావరణం చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. విశాఖ స్టేషన్‌లో ఓ వ్యక్తి హల్‌చల్‌ సృష్టించాడు. ప్రయాణికులతోపాటు ఆర్పీఎఫ్‌, జీఆర్పీ పోలీసులను టెన్షన్‌ పెట్టాడు. రూఫ్‌టాప్‌ పైకి ఎక్కి విద్యుత్‌ తీగలను పట్టుకుంటానని బెదిరింపులకు దిగాడు. అతడిని సురక్షితంగా కిందికి తీసుకొచ్చేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. తొలుత విద్యుత్‌ సరఫరా నిలిపి ఆ వ్యక్తి వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా.. నాలుగో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైలుపైకి దూకాడు. 

దీంతో అతడి వెంట పరుగులు పెట్టిన పోలీసులు.. ఎట్టకేలకు ప్రయాణికుల సాయంతో అదుపులోకి తీసుకున్నారు. అయితే, సదరు వ్యక్తికి మతిస్థిమితం సరిగా లేదని తెలుస్తోంది. అనంతరం, పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. దీంతో, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)