Breaking News

ఇలా ఐతే ప్రాణం పోసేది ఎలా?

Published on Tue, 04/01/2025 - 05:27

చల్లపల్లి (అవనిగడ్డ): అత్యవసర పరిస్థితుల్లో రోగులు, క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి వారి ప్రాణాలు కాపాడాల్సిన 108 వాహనాలు నిర్వహణ, యాంత్రిక లోపాలతో కునారిల్లుతున్నాయి. అత్యవసర సమయంలోనూ వాహనాలు కదలకుండా మొరాయిస్తే, నలుగురు కలిసి నెట్టి స్టార్ట్‌ చేయాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా చల్లపల్లిలో 108కి ఇదే దుస్థితి దాపురించింది. స్టార్ట్‌ చేసి ఎంతసేపటికీ ఫలితం లేకపోవటంతో రోడ్డున పోయే నలుగురిని పిలిచి నెట్టించారు. 

అరకిలోవీుటరుకు అరగంట పట్టింది
వాహనం స్టార్టింగ్‌ తో పని అయిపోలేదు. అర కిలోమీటరు దూరంలో ఉన్న క్షతగాత్రుల్ని చేరుకోవటానికి అరగంట పట్టింది. సోమవారం ఉదయం కృష్ణాజిల్లా, మొవ్వ మండలం పెదపూడి గ్రామానికి చెందిన కందుల కోటేశ్వరరావు తన అక్క శేషమ్మతో కలిసి అవనిగడ్డలోని తమ బంధువుల ఇంటికి వెళ్తూ చల్లపల్లి ఆటోనగర్‌ వద్ద ప్రమాదానికి గురయ్యారు. కోటేశ్వరరావు ముఖానికి, చేతికి తీవ్ర గాయాలయ్యా­యి. శేషమ్మ తలకు తీవ్ర గాయమవడంతో స్పృహ కోల్పోయింది. స్థానికులు ప్రమాదం జరిగిన వెంటనే 108కు ఫోన్‌ చేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి అర కిలోమీరు దూరంలో చల్లపల్లి మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో 108 వాహనం ఉంది. 

సమాచారం అందుకున్న 108 పైలెట్‌ వాహనాన్ని స్టార్ట్‌ చేయబోగా అది మొరాయించింది. ఎంత సేపటికీ కదలకపోవడంతో రోడ్డునపోయే నలుగురిని పిలిచి నెట్టించినా వాహనం కదల్లేదు. 15 నిమిషాల తరువాత వాహనం స్టార్టయి ఘటనాస్థలానికి చేరుకుంది. అర కిలోమీటరు దూరం రావడానికి ఇంత ఆలస్యమా? అంటూ స్థానికులు 108 సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్టార్టింగ్‌ సమస్యఅని చెప్పిన సిబ్బంది క్షతగాత్రుల్ని వెంటనే చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి మచిలీపట్నం తరలించారు. నలుగురు కలిసి తోస్తే గానీ స్టార్ట్‌ కాని 108 వాహనం అత్యవసర సమయాల్లో బాధితుల ప్రాణాలను ఎలా కాపాడుతుందని  స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)