Breaking News

రేషన్‌ కోసం 13 కిలోమీటర్ల నడక

Published on Wed, 06/18/2025 - 02:56

రావికమతం: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్‌ విధానానికి కూటమి సర్కారు మంగళం పాడటంతో అనకాపల్లి జిల్లాలోని గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కిలోమీటర్లు నడిచి సరుకులు తెచ్చుకోవాల్సి వస్తోంది. సరైన రోడ్డు సదుపాయం లేకపోవడంతో తలపై సరుకుల మూట మోస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. రావికమతం మండలం కళ్యాణలోవ గ్రామానికి దగ్గరలో గిరిజన కో–ఆపరేటివ్‌ కార్పొరేషన్‌ (జీసీసీ) డిపో ఉంది. ఈ డిపో నుంచి నీడబంద గ్రామానికి 13 కిలోమీటర్ల దూరం. 

అజయ్‌పురం, బంగారు బందలు, కడగడ్డ గంగాదేవిపేట, రొచ్చిపనుకు, రాయిపాడు, పెదగరువు, తాటిపర్తి గ్రామాల వారికి సైతం ఇంచుమించు అదే దూరంలో ఈ జీసీసీ డిపో ఉంటుంది. ఇన్నాళ్లూ తమ గ్రామానికో.. రోడ్డు సదుపాయం ఉన్న సమీప గ్రామానికో రేషన్‌ బండి వస్తే హాయిగా సరుకులు తెచ్చుకున్న గిరిజనులు ఇప్పుడు అంత దూరం కాలినడకన డిపోకు వెళ్లి రేషన్‌ తెచ్చుకోవాల్సి వస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లోనైనా ఎండీయూ వాహనాలు నడపాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కనీసం సమీపంలోని చీమలపాడు పంచాయతీ పరిధిలో గల జెడ్‌.జోగింపేటలో సబ్‌ డిపో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఈ గ్రామం చుట్టుపక్కల ప్రాంతాలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 300 రేషన్‌ కార్డులున్నాయి. సెల్‌ టవర్లున్నా సిగ్నల్స్‌ లేకపోవడంతో తరచూ అంతరాయం ఏర్పడుతోందని ఆఫ్‌లైన్‌లో బియ్యం పంపిణీ చేయాలని కోరుతున్నారు. బియ్యం ఉచితంగా ఇస్తున్నా ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని, రోడ్డు సదుపాయం లేని గ్రామాల వారు నడిచి వెళ్లి సరుకులు తెచ్చుకోవడానికి నరక యాతన అనుభవిస్తున్నారని, తమ కష్టాలు తీర్చాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)