Breaking News

ఖర్చుల్లో తగ్గేది లేదంటున్న ఆంధ్రులు

Published on Sat, 01/04/2025 - 05:53

ఖర్చుల విషయంలో ఆంధ్రులు తగ్గేదే లేదంటున్నారు. ఏపీలో గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో నెలవారీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం జాతీయ స్థాయిని మించి నమోదైంది. 2022–23 ఆరి్థక ఏడాదితో పోలిస్తే.. రాష్ట్రంలోగ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండింటిలోనూ 2023–24లో నెలవారీ తలసరి వినియోగం వ్యయం పెరిగింది. 

2022–23తో పోలిస్తే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం 9.38 శాతం, పట్టణాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం 5.89 శాతం పెరిగింది. 2022–23తో పోలిస్తే రాష్ట్రంలో 2023–24లో గ్రామీణ నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ.457, పట్టణ ప్రాంతాల్లో రూ.400 పెరిగింది. గృహ వినియోగ వ్యయ సర్వే 022–23–24ను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసింది. 

ఈ సర్వే ప్రకారం 2023–24లో జాతీయ స్థాయిలో నెలవారీ పట్టణ తలసరి వినియోగ వ్యయం రూ.6,996 ఉండగా.. ఏపీలో నెలవారీ పట్టణ తలసరి వినియోగ వ్యయం రూ.7,182గా నమోదైంది. జాతీయ స్థాయి గ్రామీణ తలసరి వినియోగ వ్యయం రూ.4,122 ఉండగా.. ఏపీలో గ్రామీణ తలసరి వినియోగ వ్యయం రూ.5,327గా నమోదైంది.       – సాక్షి, అమరావతి

ఆహారేతర వస్తువులపైనే ఖర్చు
అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా ఆహారేతర వస్తువుల వినియోగంపైనే ఎక్కువ వ్యయం చేస్తున్నట్టు సర్వేలో స్పష్టమైంది. 2023–24లో గ్రామీణ ప్రాంతాల్లో 53 శాతం, పట్టణ ప్రాంతాల్లో 60 శాతం ఆహారేతర వస్తువుల వినియోగంపైనే వ్యయం చేశారు. రవాణా, దుస్తులు, పరుపులు, పాదరక్షలు, ఇతర వస్తువులు, వినోదం, మన్నికైన వస్తువులు ఆహారేతర వ్యయంలో ప్రధాన వ్యయ వాటాను కలిగి ఉన్నాయి.

పట్టణ ప్రాంతాల్లో ఆహారేతర వ్యయంలో ఇంటి అద్దె దాదాపు 7 శాతం వాటా కలిగి ఉంది. ప్రధానంగా పానీయాలు, రిఫ్రెష్‌మెంట్‌లు, ప్రాసెస్‌ చేసిన ఆహారంలో వ్యయం కొనసాగుతోంది. ఆ తరువాత పాలు, పాల ఉత్పత్తులు, కూరగాయలు ఆహార వ్యయంలో ప్రధానంగా ఉన్నాయి. 2022–23తో పోలిస్తే జాతీ య స్థాయిలో 2023–24లో గ్రామీణ ప్రాంతాల్లో నెల వారీ తలసరి వినియోగ వ్యయం 9 శాతం, పట్టణ ప్రాంతాల్లో 8 శాతం పెరిగింది. 

జాతీయ స్థాయిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య నెలవారీ తలసరి వినియోగ వ్యయం వ్యత్యాసం మరింత తగ్గింది. 2022–23లో 71 శాతం ఉండగా 2023–24లో 70 శాతానికి తగ్గింది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన వినియోగం పెరుగుదలను సూచిస్తోంది.  

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)