Breaking News

అవార్డులతో విద్యుత్‌ సంస్థల బాధ్యత పెరిగింది

Published on Mon, 12/26/2022 - 04:20

సాక్షి, అమరావతి: విద్యుత్‌ సంస్థలకు ఈ ఏడాది దక్కిన ప్రతి­ష్టాత్మక అవార్డులు వినియోగదారులకు మరింత మెరు­గైన సేవలందించే బాధ్య­తను మరింత పెంచాయని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఏపీ సీపీడీసీఎల్‌) ఆధ్వర్యంలో విజ­యవాడలో ఈ నెల 28న ఏపీ జెన్‌కో, ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ డిస్కంలు, నెడ్‌­క్యాప్, రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్, వివిధ విభాగాల ఉద్యో­గులతో ఉన్నత­స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణ­యిం­చారు.

ఈ సందర్భంగా ఆది­వారం ఆయన విద్యుత్‌ శాఖ ఉన్నతా­ధి­కారులతో టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీ­క్ష నిర్వహించారు. రాష్ట్రపతి నుంచి అందుకున్న నేషనల్‌ ఎన­ర్జీ కన్జర్వేషన్‌ అ­వార్డు దేశంలో ఏపీ ఖ్యాతిని మరింతగా పెంచిందని మంత్రి అన్నారు. 

ఏకైక రాష్ట్రం ఏపీ
ఇంధన మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి సంబంధించి దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా ఎనర్షియా సమ్మిట్‌లో ఏపీ మరో 3 అవార్డులను గెలుచుకుందని మంత్రి పెద్దిరెడ్డి గుర్తు చేశారు. ఏపీ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ దేశంలోనే అత్యుత్తమ ట్రాన్స్‌­మి­షన్‌ యుటిలిటీగా, ఉత్తమ పునరు­త్పాదక సంస్థల్లో ఒకటిగా నెడ్‌క్యాప్‌ 
నిలిచా­య­­న్నారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీఎస్‌ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Videos

కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్

హైదరాబాద్ లో కరోనా కేసు నమోదు

జహీరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

YSRCP హరికృష్ణను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి.. దారుణం! : Ambati Rambabu

Sake Sailajanath: ఆరోపణలే తప్ప ఆధారాలు లేవు

First case: కడప కరోనా కేసును దాచిపెట్టేందుకు అధికారుల యత్నం

హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ట్రంప్ సర్కార్ 6 షరతులు

Chittoor: మామిడి రైతుల ఆవేదన..చేతులెత్తేసిన కూటమి

West Godavari: పేదల కల కలగానే మిగిలింది పడకేసిన ఇళ్ల నిర్మాణ పనులు

Photos

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)