Breaking News

ప్రతి ఆడపిల్లకు రక్షణ కల్పించడం సాధ్యం కాదు

Published on Mon, 11/11/2024 - 05:23

సాక్షి, అమరావతి/గుంటూరు (ఎడ్యుకేషన్‌): ప్రతి ఆడపిల్లకు రక్షణ కల్పించడం పోలీసులకు సాధ్యం కాదని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ అన్నారు. ఆడపిల్లలు, మహిళలపై దాడులు, అఘాయిత్యాలను సమాజమే దీటుగా ఎదుర్కోవాలన్నారు. గుంటూరు అరణ్య భవన్‌లో ఆదివారం అటవీ అమర వీరుల సంస్మరణ సభలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. మహిళలపై నేరాలు, ఘోరాలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోందని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు పైవిధంగా స్పందించారు. 

నిందితులను కఠినంగా శిక్షించేందుకు ఎన్ని చట్టాలు తెచ్చినా, వాటి అమలులో చిత్తశుద్ధి కావాలన్నారు. నిర్భయ వంటి చట్టాలు తెచి్చనా.. కోల్‌కతాలో వైద్యురాలిపై పాశవిక దాడి జరిగిందన్నారు. తమ కళ్లెదుట జరుగుతున్న నేరాలు, ఘోరాలను ప్రతిఘటించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. విద్యార్థినులు ఆత్మరక్షణ విద్య నేర్చుకుని, తమపై దాడులకు తెగబడే ఉన్మాదులపై తిరగబడాలని పిలుపునిచ్చారు. గంజాయి. మత్తు పదార్థాలను అరికట్టేందుకు శాశ్వత చర్యలు తీసుకుంటామన్నారు. 
 
అధికారుల్ని బెదిరిస్తే సుమోటో కేసులు 
రాష్ట్రంలో జరుగుతున్న అరెస్టులపై వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసు అధికారులను బెదిరిస్తున్నారని, తమ ప్రభుత్వం వస్తే ఎక్కడ ఉన్నా పిలిపిస్తామని ఐపీఎస్‌ అధికారులపై చేస్తున్న బెదిరింపులపై సు­మోటో కేసులు వేస్తామని పవన్‌కళ్యాణ్‌ హెచ్చరించారు. 

ఒక మాజీ సీఎం స్థాయిలో పోలీసు అధికారుల­ను బెదిరించడం సరైంది కాదని వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తిరుపతి జిల్లా ఎ­స్పీ సు­బ్బరాయుడు సప్త సముద్రాల ఆవల ఉన్నా వ­­దలం అని మాజీ సీఎం అంటున్నారని, విధి నిర్వహ­­ణలో ఉన్న అధికారులను బెదిరిస్తే ఊరుకునేది లే­­దన్నారు. 20 ఏళ్లు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే ఉంటుందని గతంలో పోలీసు అధికారులతో ఘోర త­ప్పి­దాలు చేయించారన్నారు.

గత ప్రభుత్వంలో ము­ఖ్య­­మంత్రి పర్యటనల పేరిట రోడ్ల పక్కన చెట్లు నరికే­శారని, ఈ వ్యవహారంలో బాధ్యులపై వాల్టా చ­ట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. షర్మిల కో­­­రితే ప్రభుత్వ పరంగా భద్రత కల్పిస్తామని చె­ప్పా­రు. 
 
సరస్వతి భూములపై చర్యలు 
సరస్వతి పవర్‌ ప్లాంట్‌ భూముల వ్యవహారంపై చర్యలు చేపడతామని పవన్‌కళ్యాణ్‌ చెప్పారు. 76 ఎకరాల అసైన్డ్‌ భూములు, చుక్కల భూములు ఆక్రమించారని పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారులతో ఈ అంశంపై చర్చిస్తున్నామన్నారు. 

పవర్‌ ప్లాంట్‌ పరిధిలో గ్రీన్‌జోన్‌ ఏర్పాటు చేయలేదని, కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు సైతం లేవని అన్నారు. విశాఖ నడి»ొడ్డున గంజాయి పెంచుతున్నారని, గంజాయి సాగు, డ్రగ్స్‌ నిర్మూలనకు సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. అటవీ దళాల అధిపతి చిరంజీవి చౌదరి, అటవీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)