అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణీకులకు ‘బస్సు’ తిప్పలు
Published on Tue, 06/10/2025 - 08:25
విజయవాడ: ఏపీలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. వేసవి సెలవులు మగిసిన తర్వాత హైదారాబాద్ బయల్దేరారు ఏపీలోని ప్రజలు. అయితే ప్రయాణీకుల రద్దీకి తగినంతగా బస్సుల ఏర్పాటు చేయడంలో ఏపీఎస్ ఆర్టీసీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దాంతో ప్రయాణికలు తీవ్ర ఇబ్బందుల పడ్డారు. ప్రత్యేక బస్సులు నడపడంలో ప్రభుత్వ వైఫల్యం పూర్తిగా కనబడింది. వేసవి సెలవులు ముగిశాయని తెలిసినా ప్రభుత్వం మాత్రం సాధారణ బస్సు సర్వీసులకే పరిమితమైంది.
ఎటువంటి ప్రత్యేక బస్సు సర్వీసుల ఏర్పాట చేయకపోవడంతో విజయవాడ నుంచి హైదరాబాద్కు వచ్చే వారు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. గతరాత్రి విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లో బస్సులు లేక జనం అవస్థలు పడ్డారు. గతంలో ఎప్పుడూ ఇలా చూడలేదని, ప్రత్యేకంగా గత ఏడాది కూడా ఇలానే వచ్చినా ఈ తరహాలో బస్సులు లేకుండా ఇబ్బందులు పడలేదని ప్రయాణీకులు అంటున్నారు.
Tags : 1