జనాభా ఆధారిత యూనిట్‌ విధానంలో పార్టీ కమిటీలు

Published on Thu, 01/22/2026 - 04:35

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ కమిటీల నిర్మాణంలో ఇకపై జనాభా ఆధారిత యూనిట్‌ విధానం అనుసరించాలని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. మున్సిపల్‌ వార్డు, కార్పొరేషన్‌ డివిజన్, పంచాయతీ పరిధిలో 2,500 కంటే ఎక్కువ జనాభా ఉన్న సందర్భాల్లో ఆ పరిధిలోని ప్రతి సచివాలయ పరిధిని ఒక ప్రత్యేక యూనిట్‌గా తీసుకోవాలని.. ఆ యూనిట్‌కు ఒక కోర్‌ కమిటీ, ఏడు అనుబంధ విభాగాల కమిటీలు ఏర్పాటుచేయాలని ఆయన చెప్పారు. 

వైఎస్సార్‌సీపీ టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు, పార్లమెంట్‌ పరిశీలకులతో బుధవారం సజ్జల జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మార్పుతో పార్టీ సంస్థాగత బలాన్ని కిందిస్థాయిలో మరింత పటిష్టం చేయడం, కార్యకర్తలకు స్పష్టమైన బాధ్యతలు, మెరుగైన సమన్వయం కల్పించడం, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పారు. 

పార్టీ టెక్నికల్‌ టీం అవసరమైన మ్యాపింగ్, డిజిటల్‌ సపోర్ట్‌ అందిస్తూ కమిటీల డిజిటలైజేషన్‌ ప్రక్రియ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ యూనిట్‌ విధానం పట్టణ ప్రాంతాలైన మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మేజర్‌ పంచాయతీలకు వర్తిస్తుందని సజ్జల చెప్పారు. 

పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్‌చార్జ్‌ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 25లోగా కమిటీల నిర్మాణానికి సంబంధించిన పూర్తి సమాచారం కేంద్ర కార్యాలయానికి పంపాలన్నారు. ఉగాది రోజు పార్టీ కేడర్‌కు ఐడీ కార్డులు అందించే ఆలోచనలో ఉన్నందున నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని కోరారు.  

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)