Breaking News

పరిటాల వర్గం హల్‌చల్‌.. బీజేపీ కార్యకర్తపై దాడి

Published on Thu, 06/19/2025 - 09:02

సాక్షి, శ్రీ సత్యసాయి: ఏపీలో కూటమి సర్కార్‌లో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకుంది. బీజేపీ కార్యకర్తను టార్గెట్‌ చేసిన పరిటాల వర్గీయలు.. దాడులకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేతలు.. బీజేపీ కార్యకర్త అరవింద్‌ రెడ్డిపై కర్రలు, మారణాయుధాలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో, వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.

రాప్తాడులో పరిటాల వర్గీయులు హల్‌చల్‌ చేశారు. ధర్మవరం బీజేపీ కార్యకర్త అరవింద్ రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. చెన్నేకొత్తపల్లిలో అరవింద్ రెడ్డి దాబా వద్ద ఆగిన సమయంలో పరిటాల శ్రీరామ్‌ అనుచరులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం, ఎన్నికల సమయంలో ధర్మవరం టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పాలని అరవింద్‌తో వాదనకు దిగారు. అరవింద్‌ రెడ్డి.. తమ కాళ్లపై పడి క్షమాపణ చెప్పాలని పరిటాల అనుచరులు ఓవరాక్షన్‌కు దిగారు.

దీంతో, వారి మధ్య వాగాద్వం జరిగింది. ఆగ్రహంతో రెచ్చిపోయిన పరిటాల వర్గీయులు.. తమ వద్ద ఉన్న కర్రలు, మారణాయుధులతో అరవింద్‌ రెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో అరవింద్‌ రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం, బాధితుడు అరవింద్‌ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ తనపై హత్యాయత్నం చేయించారని ఆరోపించాడు. కావాలనే తనను టార్గెట్‌ చేశారని చెప్పుకొచ్చారు. ఇక, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరీకి అరవింద్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)