Breaking News

అంబులెన్స్‌ డ్రైవర్‌ అమానుషం

Published on Sun, 05/25/2025 - 05:45

మహారాణిపేట (విశాఖ) : విశాఖపట్నం కేజీహెచ్‌లో ఇదో అమానుష ఘటన. టీడీపీ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వాస్పత్రుల పనితీరుకు అద్దంపట్టిన దారుణం. అనారోగ్యంతో మృతిచెందిన రెండు నెలల పసికందును, ఆ చిన్నారి తల్లిదండ్రులను కేజీహెచ్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌ నిర్దాక్షిణ్యంగా నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయిన ఘోర ఉదంతమిది. దిక్కుతోచని, నిస్సహాయ స్థితిలో ఆ తల్లిదండ్రులు రాత్రిపూట విగత జీవితో ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ ఇంటికెళ్లారు. అందరినీ కదిలించే ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట పంచాయతీ మడ్రేబు గ్రామానికి చెందిన సేదరి శైలు, అర్జున్‌ దంపతులకు రెండు నెలల కిందట చిన్నారి జన్మించింది.

పాపకు శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో ఈనెల 8న విశాఖ కేజీహెచ్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం పసికందు మృతిచెందింది. పాప మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లడానికి కేజీహెచ్‌ అంబులెన్స్‌లో బయల్దేరారు. కొంతదూరం వెళ్లాక  కొత్తవలస జంక్షన్‌లో అంబులెన్స్‌ డ్రైవర్‌ వీరిని దించేశాడు. తమ వద్ద డబ్బుల్లేవని, స్వస్థలానికి తీసుకెళ్లమని తల్లిదండ్రులు ప్రాథేయపడ్డా కనికరించలేదు. దీంతో వారు తెలిసిన వారి ద్వారా డబ్బులు తెప్పించుకుని, ఆటోలో రూ.6 వేలకు సరియా వరకు వెళ్లారు. అక్కడి నుంచి రాత్రి సమయంలో పాప మృతదేహాన్ని మోసుకుంటూ ఇంటికి చేరుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వేడుకున్నా కనికరించలేదు..
ఇక ఈ దారుణంపై బాధితులు శైలు, అర్జున్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కేజీహెచ్‌ అంబులెన్స్‌ డ్రైవర్‌ చాలా నిర్దయగా ప్రవర్తించాడని ఆవేదన వ్యక్తంచేశారు. డబ్బుల్లేవని చెప్పినా వినకుండా పాప మృతదేహంతో ఉన్న తమను కొత్తవలస జంక్షన్‌లో బాధ్యతారహితంగా వదిలేశాడని ఆరోపించారు. దీంతో రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు ఐదు కిలోమీటర్ల మేర పాప మృతదేహాన్ని మోసుకుంటూ ఇంటికి చేరుకున్నామని వారిరువురూ విలపిస్తూ చెప్పారు. అంబులెన్స్‌ డ్రైవర్‌పై చర్య తీసుకోవాలని, సరియా నుంచి మాడ్రేబు వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె.గోవిందరావు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)