Breaking News

గుండెపోటుతో పర్చూరు జెడ్పీటీసీ మృతి

Published on Tue, 01/03/2023 - 18:50

సాక్షి, ప్రకాశం(పర్చూరు): గుండెపోటుతో పర్చూరు జెడ్పీటీసీ  సభ్యురాలు కొల్లా గంగాభవాని (56) సోమవారం మృతి చెందారు. ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో ఇంటి వద్దనే తుదిశ్వాస విడిచినట్లు భర్త మాజీ జెడ్పీటీసీ కొల్లా సుభాష్‌బాబు తెలిపారు. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె నాగులపాలెం సర్పంచ్‌గా పనిచేశారు.

భర్త కొల్లా సుభాష్‌బాబు సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీగా పనిచేశారు. మామ కొల్లా రామయ్య పర్చూరు తొలి ఎమ్మెల్యేగా పనిచేశారు. కొల్లా సుభాష్‌బాబుకి స్వాతంత్య్ర సమరయోధులు మాజీ మంత్రి దివి కొండయ్య చౌదరి స్వయానా బావ కావడంతో వీరి కుటుంబానికి రాజకీయంగా ప్రాధాన్యత ఉంది. ఆమె మృతి పలువురు రాజకీయ ప్రముఖులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

పలువురు నాయకులు విచారం వ్యక్తం చేసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె మృతదేహాన్ని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి, రాష్ట్ర మార్కెటింగ్, సహకార శాఖ ప్రభుత్వ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ శాసనసభ్యుడు మర్రి రాజశేఖర్, నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్త రావి రామనాథంబాబు సందర్శించి నివాళులర్పించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)