Breaking News

గోదావరి మధ్యలో నిలిచిన పంటు

Published on Mon, 12/08/2025 - 07:28

సఖినేటిపల్లి: గోదావరి నదిలో ఓ పంటుకు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మధ్య వశిష్ట గోదావరి నదిపై పంటు మీద ప్రతి రోజూ వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో ఆదివారం నర్సాపురం నుంచి సఖినేటిపల్లి వైపు సుమారు 80 మంది ప్రయాణికులు, 20 వాహనాలతో పంటు బయలుదేరింది. 

నది మధ్యలోకి చేరిన తరువాత ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో పంటు నది మధ్యలోనే నిలిచిపోయింది. దీనికి తోడు సముద్ర ఆటుపోట్ల కారణంగా గోదావరిలోకి బలంగా వస్తున్న కెరటాల ధాటికి పంటు వేగంగా సయ్యాటలాడుతూ దిశ మారింది. అందులో పిల్లలతో ఉన్న ప్రయాణికులు అరగంట పాటు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పంటుకు తాత్కాలిక మరమ్మతులు చేసేందుకు నిర్వాహకులు విఫలయత్నం చే­శారు. 

కొద్దిసేపటికి అదే రేవు నుంచి ప్రయాణికులతో వస్తున్న మరో పంటుకు తాడు కట్టి, మొరాయించిన పంటును సఖినేటిపల్లి వైపు గోదావరి ఒడ్డుకు చేర్చారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం వేలాది మంది రాకపోకలు సా­గి­స్తున్న రేవులో పంటు సామర్థ్యం, నిర్వహణలో అ«­దికారులు, నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)